News August 26, 2024
టీడీపీలోకి ఏలూరు మేయర్..!
ఏలూరులో వైసీపీకి షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. మేయర్ నూర్జహాన్, ఎస్ఎంఆర్ పెదబాబు దంపతులు TDPలో చేరేందుకు చర్చలు జరిపినట్లు సమాచారం. ఈ మేరకు మంత్రి లోకేశ్ సమక్షంలో రేపు టీడీపీ కండువా కప్పుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తోంది. 30 మంది వైసీపీ కార్పొరేటర్లు కూడా వైసీపీని వీడేందుకు సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా.. మేయర్ దంపతుల రాజకీయ ప్రస్థానం 2013లో టీడీపీతోనే మొదలైంది.
Similar News
News September 12, 2024
తణుకులో జిల్లా అథ్లెటిక్స్ జట్ల ఎంపికలు
జిల్లా అథ్లెటిక్స్ జట్ల ఎంపికలు తణుకు డిగ్రీ కళాశాలలో బుధవారం నిర్వహించారు. ఎంపికైన క్రీడాకారులు గుంటూరులో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారని ఛైర్మన్ మానేపల్లి శ్రీనివాస్ తెలిపారు. అథ్లెటిక్స్ పోటీలను అసోసియేషన్ సెక్రటరీ సంకు సూర్య నారాయణ, అధ్యక్షుడు చింతకాయల సత్య నారాయణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పారిస్ ఒలింపిక్స్ వరకు వెళ్లిన దండి జ్యోతిక శ్రీని ఘనంగా సత్కరించారు.
News September 11, 2024
మృతుల కుటుంబాలకు అండగా ఉంటాం: డిప్యూటీ సీఎం
దేవరపల్లి మండలం, చిలకావారిపాకలు వద్ద జరిగిన ప్రమాదంలో ఏడుగురు మరణించిన ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. కష్టజీవులు మరణించడం ఎంతో బాధాకరమని దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ప్రభుత్వం వారి కుటుంబాలకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ మేరకు సొషల్ మీడియా వేదికగా ఆయన స్పందించారు. ఇప్పటికే పలువురు రాజకీయ ప్రముకులు వారి మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
News September 11, 2024
కొవ్వూరు: మృతులకు న్యాయం చేస్తాం: MLA
దేవరపల్లి మండలం చిన్నాయగూడెం జీడిపిక్కల వ్యాన్ బోల్తా పడిన ఘటనలో మృతి చెందిన మృతదేహాలను కొవ్వూరు ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో మృతుల బంధువులు ఆసుపత్రి వద్ద తమకు న్యాయం చేయాలని ధర్నా చేపట్టారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యేలు మద్దిపాటి వెంకటరాజు, ముప్పిడి వెంకటేశ్వర రావు అక్కడికి చేరుకొని వారితో మాట్లాడారు. ప్రభుత్వ తరఫున రూ.5 లక్షలు, ఫ్యాక్టరీ తరఫున రూ.3 లక్షలు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు.