News March 10, 2025
టీడీపీలోనే ఉంటా.. ఏ పార్టీలో చేరను: జేసీ పవన్ రెడ్డి

పార్టీ మార్పుపై ప్రచారాన్ని JC పవన్ రెడ్డి కొట్టిపారేశారు. తాను టీడీపీలో ఉన్నానని, ఏ పార్టీలో చేరే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. వైసీపీలోకి వెళ్తున్నట్లు చెప్పడానికే మాజీ మంత్రి శైలజానాథ్ తనను కలిశారని, నిర్ణయం తీసుకున్నాక తాను ఏమి చేయగలనని, ఆల్ ది బెస్ట్ చెప్పినట్లు తెలిపారు. దావోస్ పర్యటనలో అనంతపురం జిల్లాలో రూ.1000కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రెండు కంపెనీలతో ఎంవోయూ కుదర్చగలిగానని చెప్పారు.
Similar News
News March 10, 2025
ఏలూరు: ఆర్జీల ఫిర్యాదుల పరిష్కారానికి కృషి: ఎస్పీ

ఫిర్యాదుల పరిష్కారానికి పూర్తిస్థాయిలో కృషి చేస్తామని జిల్లా ఎస్పీ ప్రతాప్ సింగ్ కిషోర్ తెలిపారు. 40 రోజుల ఎన్నికల నియమావళి ముగిసిన తర్వాత సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక తిరిగి పోలీసు శాఖ ఆధ్వర్యంలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో అనేక ఫిర్యాదులు జిల్లా ఎస్పీకి ఫిర్యాదుదారులు అందించారు. ఫిర్యాదుల పరిష్కారానికి కృషి చేస్తున్నామని జిల్లా ఎస్పీ ప్రతాప్ సింగ్ చేశారు. పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
News March 10, 2025
సినిమాల్లోకి జగ్గారెడ్డి.. ఫొటోస్ వైరల్

ఎమ్మెల్యే జగ్గారెడ్డి జీవిత చరిత్రపై సినిమా రానుంది. ఇప్పటివరకు రాజకీయ నాయకుడిగా కనిపించిన జగ్గారెడ్డి సినిమాలో నటించే అవకాశం వచ్చిందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. జగ్గారెడ్డి ‘ఏ వార్ ఆఫ్ లవ్’ పేరుతో సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ రూపకల్పన జరుగుతుందన్నారు. త్వరలో షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉండగా.. జగ్గారెడ్డి చరిత్రపై సినిమా రానుడంతో ప్రజల్లో ఆసక్తి నెలకొంది.
News March 10, 2025
సినిమాల్లోకి జగ్గారెడ్డి.. ఫొటోస్ వైరల్

ఎమ్మెల్యే జగ్గారెడ్డి జీవిత చరిత్రపై సినిమా రానుంది. ఇప్పటివరకు రాజకీయ నాయకుడిగా కనిపించిన జగ్గారెడ్డి సినిమాలో నటించే అవకాశం వచ్చిందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. జగ్గారెడ్డి ‘ఏ వార్ ఆఫ్ లవ్’ పేరుతో సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ రూపకల్పన జరుగుతుందన్నారు. త్వరలో షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉండగా.. జగ్గారెడ్డి చరిత్రపై సినిమా రానుడంతో ప్రజల్లో ఆసక్తి నెలకొంది. పాన్ ఇండియా రేంజ్లో రానుంది.