News April 10, 2024
టీడీపీలో చేరిన మంత్రి అంబటి బంధువు

బాపట్లకు చెందిన వివేకా సర్వీస్ సొసైటీ కార్యదర్శి, మంత్రి అంబటి రాంబాబు బంధువు అంబటి మురళీకృష్ణ టీడీపీలో చేరారు. మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం మురళీకృష్ణకు చంద్రబాబు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంబటి మురళీకృష్ణ 1989 నుంచి క్రియాశీల రాజకీయాల్లో ఉన్నారు. 2010 ఓదార్పు యాత్రలో వెదుళ్లపల్లిలోని తన కార్యాలయంలో వైఎస్ జగన్కు బస ఏర్పాటు చేశారు.
Similar News
News March 26, 2025
ఉగాది పండుగ నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు: చంద్రబాబు

ఉగాది పండుగ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. పంచాంగ శ్రవణం, కవి సమ్మేళనం, పురస్కారాల ప్రదానం, సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ఈ మేరకు రూ.5 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉగాది కోసం ఒక్కో జిల్లాకు రూ.10 లక్షలు కేటాయించారు.
News March 26, 2025
తాడేపల్లి: పాస్టర్ ప్రవీణ్ మృతిపై వైఎస్ జగన్ విచారం

మత ప్రబోదకుడు, పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై మాజీ సీఎం వైయస్ జగన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బుధవారం తాడేపల్లిలో ఆయన మాట్లాడుతూ.. పాస్టర్, మత ప్రబోదకుడు ప్రవీణ్ పగడాల మృతి అత్యంత బాధాకరమని, ప్రవీణ్ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపధ్యంలో నిష్పాక్షికంగా విచారణ జరపాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రవీణ్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు తెలిపారు.
News March 26, 2025
ప్రజల్లో విశ్వాసం పెరిగేలా పోలీసింగ్ ఉండాలి: చంద్రబాబు

సచివాలయంలో బుధవారం జరిగిన కలెక్టర్ల సదస్సులో పోలీసు శాఖ, శాంతిభద్రతలపై చర్చ జరిగింది. సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్ర పోలీసు శాఖకు మంచి గుర్తింపు ఉందని, రాష్ట్రంలో జీరో క్రైమ్ లక్ష్యంగా పోలీసు శాఖ వినూత్న ప్రణాళికలతో కార్యాచరణ దిశగా అడుగులేయాలన్నారు. ప్రజల్లో విశ్వాసం పెరిగేలా పోలీసింగ్ ఉండాలన్నారు. ఆధునిక టెక్నాలజీ విరివిగా ఉపయోగించుకోవాలన్నారు.