News April 4, 2024
టీడీపీ కుటిల రాజకీయం చేస్తోంది: బొత్స

గరివిడి మండలం నీలాద్రిపురం, రేగటి గ్రామాల్లో మంత్రి బొత్స సత్యనారాయణ పర్యటించారు. అనంతరం జరిగిన ప్రచార సభల్లో ఆయన మాట్లాడుతూ.. పేదలకు అందే లబ్ధితోనూ టీడీపీ కుటిల రాజకీయం చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి రహితంగా, దళారులు లేకుండా సంక్షేమ అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందిస్తున్నామ అన్నారు. వచ్చే ఎన్నికల్లో మరలా వైసీపీకి పట్టం కట్టాలని ప్రజలను కోరారు. ఎంపి బెల్లాన చంద్రశేఖర్ పాల్గొన్నారు.
Similar News
News February 8, 2026
VZM: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

డెంకాడ మండలం ముంగినాపల్లి గ్రామ సమీపంలోని మలుపువద్ద ఉన్న స్తంభాన్ని బైక్ ఢీ కొట్టడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన శనివారం అర్ధరాత్రి జరిగింది. ఈ ప్రమాదంలో పూసపాటిరేగ మండలం రెల్లివలస గ్రామానికి చెందిన ముసినేని మురళి (41) మృతి చెందాడని పోలీసులు గుర్తించారు. ఆదివారం మృతిడి భార్య సరోజిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సన్యాసినాయుడు తెలిపారు.
News February 8, 2026
రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు ఆరోపణలు: చిన్న శ్రీను

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై CM చంద్రబాబు చేసిన ఆరోపణలు రాజకీయ లబ్ధి కోసమేనని, భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఆయన వ్యవహరించారని జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) మండిపడ్డారు. ఆదివారం తన క్యాంప్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. దేశంలోనే అత్యున్నత ల్యాబ్‌లు అయిన NDRI, NDDB తిరుమల లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు లేదని స్పష్టం చేసిందన్నారు. మాట మార్చడంలో CM సిద్ధహస్తుడన్నారు.
News February 8, 2026
విజయనగరం జిల్లాలో వివిధ ప్రాజెక్టులకు ప్రతిపాదనలు

జిల్లాలో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రతిపాదనలు పంపుతున్నట్లు కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి శనివారం తెలిపారు.
➭బాడంగి, గరివిడి, ఎస్.కోటలో మూడు ఫుడ్ పార్కులు ఏర్పాటు
➭పూసపాటిరేగ మండలం రెల్లివలసలో 201 ఎకరాల్లో హెల్త్‌కేర్ ప్రాజెక్ట్
➭ఎస్.కోట–కొత్తవలసలో ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్కులు
➭10 వేల ఎకరాల్లో ఉద్యానవనాలు (అరటి, ఆయిల్‌పామ్) సాగు, పెంపకం వంటి ప్రతిపాదనలు


