News February 4, 2025

టీడీపీ కుటుంబంలో ఎలాంటి విభేదాలు లేవు: ఎమ్మెల్యే

image

నందిగామ మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. అధిష్టానం ఆదేశాలతో అందరూ కృష్ణకుమారిని ఛైర్మన్‌గా ఎన్నుకున్నామని తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. టీడీపీలో అభిప్రాయ భేదాలు అని ‌కొంత మంది ప్రచారం చేశారన్నారు. ‘మా టీడీపీ ‌కుటుంబంలో ఎటువంటి విభేదాలు లేవని తన అభిప్రాయాలను పార్టీ అధిష్టానానికి వివరించానని ఎమ్మెల్యే వివరించారు’.

Similar News

News January 18, 2026

ప్చ్.. రో‘హిట్’ అవ్వలేదు

image

న్యూజిలాండ్‌తో సిరీస్‌లో భారత ఓపెనర్ రోహిత్ శర్మ నిరాశపర్చారు. మూడో వన్డేలో 11 పరుగులే చేసి ఫౌల్క్స్ బౌలింగ్‌లో వెనుదిరిగారు. సిరీస్ మొత్తంగా 61 పరుగులే చేశారు. మరో ఆరు నెలల వరకు వన్డే మ్యాచ్‌లు లేవు. హిట్ మ్యాన్ నుంచి ఆశించిన స్థాయిలో ప్రదర్శన లేకపోవడం ఫ్యాన్స్‌ను నిరాశకు గురిచేస్తోంది. మళ్లీ IPL-2026లోనే రోహిత్ ఆటను చూడవచ్చు. ప్రస్తుతం వన్డేల్లో రోహిత్ 3వ ర్యాంకులో కొనసాగుతున్నారు.

News January 18, 2026

NGKL: మున్సిపల్ ఎన్నికలు.. అభ్యర్థుల అర్హతలు

image

2026 మున్సిపల్ ఎన్నికల అభ్యర్థులకు అధికారులు నిబంధనలు ఖరారు చేశారు. అభ్యర్థి 21 ఏళ్లు నిండిన భారత పౌరుడై ఉండాలి. సంబంధిత మున్సిపాలిటీలో ఓటరుగా ఉండాలి. పార్టీ అభ్యర్థికి ఒకరు, స్వతంత్రులకు 10 మంది ప్రపోజర్లు అవసరం. ఖర్చు పరిమితి రూ.2 లక్షల- రూ.10 లక్షల వరకు ఉంటుంది. ప్రతి ఖర్చును రిజిస్టర్‌లో నమోదు చేయడం తప్పనిసరి.

News January 18, 2026

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. ఆరుగురు మావోలు మృతి

image

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఏరివేత కొనసాగుతోంది. నేషనల్ పార్కు ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నిన్న నలుగురు, ఇవాళ ఇద్దరు మావోయిస్టులు మరణించారు. మృతుల్లో నలుగురు మహిళలు ఉన్నారు. ఘటనాస్థలంలో AK-47 సహా 6 తుపాకులు, పేలుడు పదార్థాలను భద్రతాబలగాలు స్వాధీనం చేసుకున్నాయి.