News April 26, 2024

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక

image

ఎంపీ, ఎమ్మెల్యే సీటు దక్కని కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మికి టీడీపీ జాతీయ కమిటీలో చోటు కల్పించారు. ఆమెను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఈ మేరకు అచ్చెన్నాయుడు ఓ ప్రకటన విడుదల చేశారు. 2019, 2021 ఉప ఎన్నికలో ఆమె టీడీపీ తిరుపతి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. తనకు లేదా తన భర్తకు ఈసారి ఎమ్మెల్యే లేదా ఎంపీ సీటు ఆశించారు. ఇవేమీ దక్కకపోవడంతో పార్టీ పదవి కట్టబెట్టారు.

Similar News

News April 14, 2026

ఆత్మకూరు: ఆటోలోనే డ్రైవర్ మృతి

image

ఆత్మకూరు శివారులోని నెల్లూరు పాలెం వద్ద సోమవారం ఆటోలోనే డ్రైవర్ జమీర్(57) మృతి చెందారు. టిట్కో గృహాల్లో నివసించే ఆయన ఉదయం ఇంటి నుంచి వెళ్లిన తర్వాత నెల్లూరు పాలెం వద్ద ఆటోలోనే విగతజీవిగా పడి ఉండటాన్ని స్థానికులు గమనించారు. అనారోగ్యం లేదా ఎండ తీవ్రత వల్ల మృతి చెంది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News April 14, 2026

నెల్లూరు: బాధితురాలికి ప్రభుత్వ ఉద్యోగం.!

image

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు బాధితురాలు టీ. దుర్గకు ప్రభుత్వం అండగా నిలుస్తూ ఉద్యోగం కల్పించిందని కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ఆమెకు పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ శాఖలో ఆఫీస్ సబార్డినేట్‌గా నియామక ఉత్తర్వులు అందజేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటూ, జీవనోపాధి కల్పిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ నిర్ణయం పట్ల బాధితులు హర్షం వ్యక్తం చేశారు.

News April 14, 2026

అట్రాసిటీ బాధితురాలికి సర్కారు కొలువు!