News March 10, 2025

టీడీపీ తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్

image

టీడీపీ తరఫున కావలి గ్రీష్మ, బీదా రవిచంద్ర యాదవ్, బీటీ నాయుడు ఎమ్మెల్సీ నామినేషన్ దాఖలు చేశారు. సోమవారం అసెంబ్లీ ఆవరణలో రిటర్నింగ్ అధికారికి అభ్యర్థులు పత్రాలు అందచేశారు. అభ్యర్థులకు మద్దతుగా నారా లోకేశ్, అచ్చెన్నాయుడు, కందుల దుర్గేష్, విష్ణుకుమార్ రాజు, రఘురామకృష్ణంరాజు, పితాని సత్యనారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పల్లా శ్రీనివాస్, టీడీ జనార్దన్, కురుగొండ్ల రామకృష్ణ వచ్చారు.

Similar News

News March 11, 2025

PGRSలో వచ్చిన అర్జీలు వెంటనే పరిష్కారం చేయాలి: కలెక్టర్ 

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) ద్వారా వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కారం చేయాలని గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మీ అన్నారు. ఈ మేరకు కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆమె పాల్గొని స్వయంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రజా సమస్యల విషయంలో ఎవరు అలసత్వం వహించరాదని అధికారులను ఆదేశించారు.

News March 10, 2025

గుంటూరుకు 100 ఎలక్ట్రిక్ బస్సులు: పెమ్మసాని

image

గుంటూరుకు 100 ఎలక్ట్రిక్ బస్సులను మంజూరు చేసినట్లు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆదివారం ప్రకటించారు. PPP మోడల్‌లో ఈ బస్సులు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. అందులో భాగంగా గుంటూరు బస్టాండ్‌ను పరిశీలించి, స్థల సేకరణ, ఎలక్ట్రికల్ వాహనాల నిర్వహణ వంటి అంశాలపై చర్చించటం జరిగిందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.

News March 10, 2025

గుంటూరు: వరల్డ్ నంబర్ 1 ర్యాంకింగ్ మనోడికే.! 

image

గుంటూరుకు చెందిన అరిగెల భార్గవ్ బ్యాడ్మింటన్‌లో అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తూ సత్తా చాటుతున్నాడు. తాజాగా జూనియర్ వరల్డ్ ర్యాంకింగ్స్ డబుల్స్ విభాగంలో ఉమ్మడి కడప జిల్లా రైల్వేకోడూరుకు చెందిన గొబ్బూరి విశ్వతేజతో కలిసి వరల్డ్ నంబర్ 1 స్థానంలో నిలిచాడు. ఈ మేరకు గుంటూరు జిల్లాకు చెందిన పలువురు భార్గవ్‌ను అభినందిస్తున్నారు. 

error: Content is protected !!