News July 4, 2024
టీడీపీ నాయకుల దాడిలో గాయపడి వైసీపీ నాయకుడి మృతి
హిందూపురం రూరల్ గొల్లాపురంలో టీడీపీ నాయకులు చేసిన దాడిలో తీవ్రంగా గాయపడిన వైసీపీ కార్యకర్త సతీశ్(45) బెంగళూరులో చికిత్స పొందుతూ మృతిచెందాడు. రాజకీయ కక్షతో కొంతమంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు సతీశ్‌పై విచక్షణారహితంగా దాడి చేసి గాయపరిచారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ మృతిచెందినట్లు వాపోయారు.
Similar News
News October 14, 2024
విద్యాశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలి: డీఈఓ
అనంతపురం జిల్లాలో మండల విద్యాశాఖ అధికారులు రానున్న మూడు రోజులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా విద్యాశాఖ అధికారి వరలక్ష్మి తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో శిథిలావస్థకు చేరిన భవనాల్లో పాఠశాల నిర్వహించకుండా చూడాలన్నారు .అదేవిధంగా పాఠశాల నుంచి ఇంటికి వెళ్లే రహదారుల్లో వంకలు, వాగులు ఉండే పాఠశాలలను ముందుగా గుర్తించి ఇబ్బంది పడకుండా సెలవులు ప్రకటించాలని ఆదేశించారు.
News October 13, 2024
‘మద్యం దుకాణాల లాటరీ సందర్భంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు’
పుట్టపర్తిలో సోమవారం జరిగే మద్యం దుకాణాల లాటరీ సందర్భంగా పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్టు జిల్లా ఎస్పీ రత్న పేర్కొన్నారు. ఆదివారం రాత్రి పోలీస్, ఎక్సైజ్ అధికారులతో ఎస్పీ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. టెండర్ల సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నియమ నిబంధనల గురించి తెలిపారు. మద్యం దుకాణాల టెండర్లకు సంబంధించి ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు.
News October 13, 2024
గొల్లపల్లి రిజర్వాయర్‌లో పడి వ్యక్తి మృతి
పెనుకొండ మండల పరిధిలోని గొల్లపల్లి రిజర్వాయర్‌లో పడి హిందూపురం మండలం లింకంపల్లి గ్రామానికి చెందిన హానిస్ ఖాన్(42) ఆదివారం మృతిచెందారు. ఎస్ఐ రాజేశ్ వివరాల మేరకు.. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలసి గొల్లపల్లి రిజర్వాయర్‌కు వెళ్లి ప్రమాదవశాత్తూ కాలు జారి అందులో పడిపోయాడు. స్నేహితులు, కుటుంబ సభ్యులు కాపాడే లోపే మరణించినట్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.