News July 9, 2024
టీడీపీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీ నాయకుడిపై కేసు

అనంతపురం జిల్లా కనేకల్ మండలంలోని 43 ఉడేగోళం గ్రామ వైసీపీ నాయకుడు రామాంజనేయులుపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 1న పింఛన్ల పంపిణీ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు, గ్రామ టీడీపీ నాయకులపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రామాంజనేయులుపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
Similar News
News January 2, 2026
ఇంటర్నేషనల్ చెస్ టోర్నమెంట్లో శ్రీహ సత్తా

మధురైలో ఏథెన్స్ ఆఫ్ ది ఈస్ట్ డిసెంబర్ 30న ఐదో సారి నిర్వహించిన గ్రాండ్ మాస్టర్ ఇంటర్నేషనల్ బిలో 1800 ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్లో ప్రపంచవ్యాప్తంగా 1,245 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఇందులో అనంతపురం జిల్లా క్రీడాకారిణి శ్రీహ 9కి 7 పాయింట్లతో ఓపెన్ విభాగంలో 21వ స్థానాన్ని సాధించింది. గురువారం కోచ్ ఉదయ్ కుమార్ మాట్లాడుతూ.. శ్రీహ ప్రపంచ స్థాయి టోర్నమెంట్లో రాణించి జిల్లా ఖ్యాతిని పెంచిందన్నారు.
News January 2, 2026
శిల్పారామంలో అలరించిన నూతన సంవత్సర వేడుకలు

అనంతపురం శిల్పారామంలో నూతన సంవత్సరం సందర్భంగా గురువారం సాయంత్రం
నిర్వహించిన విభిన్న సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా జానపద గేయాలు, నృత్య ప్రదర్శనలను నిర్వహించినట్లు పరిపాలనాధికారి పి.శివ ప్రసాద్ రెడ్డి తెలిపారు. శిల్పారామానికి వచ్చిన వీక్షకుల్లోని చిన్నారులు నృత్య ప్రదర్శన ఇచ్చారన్నారు. ఈ వేడుకలో సుమారు 5,000 మంది పాల్గొన్నారన్నారు.
News January 1, 2026
గుంతకల్లులో గుర్తు తెలియని వ్యక్తి మృతి

గుంతకల్లులోని పారిశ్రామిక వాడ సమీపంలో గురువారం చోటు చేసుకున్న ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. బైక్పై వెళ్తున్న అతను ప్రమాదానికి గురయ్యాడు. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


