News September 26, 2024
టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణకు అస్వస్థత

టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ స్వల్ప గుండెపోటుకు గురయ్యారని సమాచారం. గురువారం తెల్లవారుజామున రాధాకు ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వంగవీటి రాధా డాక్టర్ల అబ్జర్వేషనలో ఉన్నారు. రాధా విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు ప్రకటించారు. 48 గంటలు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని సూచించారు.
Similar News
News December 22, 2025
టైమ్ బాండ్ ప్రకారం PGRS అర్జీలను పరిష్కరించాలి: కలెక్టర్

పీజీఆర్ఎస్లో వచ్చిన అర్జీలను టైమ్ బాండ్ ప్రకారం పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో నిర్వహించిన పీజీఆర్ఎస్ లో ఆయన పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. పెండింగ్లో ఉన్న అర్జీలపై సమీక్షించిన కలెక్టర్ తక్షణమే క్లియర్ చేయాలన్నారు. ఈ-ఆఫీల్ ఫైల్స్ క్లియరెన్స్ లో కూడా చురుగ్గా వ్యవహరించాలన్నారు.
News December 22, 2025
కృష్ణా: పల్స్ పోలియో నిర్వహణలో మన జిల్లాకే స్టేట్ ఫస్ట్.!

5 సంవత్సరాల లోపు చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేయడంలో కృష్ణా జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. జిల్లాలో 95.49% మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసినట్టు జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి యుగంధర్ తెలిపారు. 1,45,588 మంది చిన్నారులకు గాను 1,39,024 మందికి పోలియో చుక్కలు వేసినట్లు తెలిపారు. మిగిలిన వారికి సోమ, మంగళవారాల్లో ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు వేస్తామన్నారు.
News December 22, 2025
నేడు కలెక్టరేట్లో ఎంప్లాయిస్ గ్రీవెన్స్: కలెక్టర్

మచిలీపట్నంలోని కలెక్టరేట్లో నేడు ఎంప్లాయిస్ గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. ఉదయం 9.30 నుంచి 10.30 గంటల వరకు ప్రభుత్వ ఉద్యోగుల నుంచి అర్జీలు స్వీకరించడం జరుగుతుందన్నారు. ఉద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఉదయం 10.30 నుంచి మీకోసం కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నట్లు తెలిపారు.


