News December 24, 2024

టీడీపీ, వైసీపీ కార్యకర్తల రాళ్ల దాడి.. 33 మందిపై కేసులు

image

కొమరోలు మండలంలోని ముత్తరాసు పల్లె గ్రామంలో ఇరువర్గాల పరస్పరం రాళ్లతో దాడులు చేసుకున్న సంఘటనపై కేసులు నమోదు చేసినట్లుగా కొమరోలు ఎస్ఐ వెంకటేశ్వర్లు నాయక్ వెల్లడించారు. ఆదివారం సాయంత్రం రాజకీయ కక్ష్యల నేపథ్యంలో ఇరువర్గాలు రాళ్లతో దాడులు చేసుకోగా ఇరువర్గాల ఫిర్యాదు మేరకు టీడీపీకి చెందిన 14 మందిపై, వైసీపీకి చెందిన 19 మందిపై కేసులు నమోదు చేసినట్లుగా వెల్లడించారు.

Similar News

News January 23, 2025

ప్రకాశం: భార్యను చంపి.. కుక్కర్‌లో ఉడకబెట్టాడు

image

రాచర్ల మండలం JP చెరువుకు చెందిన మాధవిని ఆమె భర్త హత్య చేసిన ఘటన HYDలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. ‘13 ఏళ్ల క్రితం మాధవితో గురుమూర్తికి వివాహమైంది. ఇటీవల గొడవపడి భార్య తలపై గట్టిగా కొట్టాడు. దీంతో ఆమె స్పృహ తప్పింది. చనిపోయిందనుకొని మృతదేహాన్ని ముక్కలుముక్కలుగా నరికి కుక్కర్‌లో వేసి ఉడికించాడు. ఎముకలు పొడిచేసి, చెరువులో పడేశాడు. ఆదివారం మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాడు’ అని తెలిపారు.

News January 23, 2025

మార్టూరులో సినిమా స్టైల్‌లో దొంగతనం

image

మార్టూరులో సినిమా స్టైల్ లో బుధవారం దొంగతనం జరిగింది. బల్లికురవ మండలానికి చెందిన ఓ వ్యక్తి మార్టూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతని సన్నిహితుడిని చూడటానికి వచ్చాడు. కారును రోడ్డు పక్కన ఉంచి ఆసుపత్రిలోకి వెళ్లాడు. అదును చూసిన దొంగలు తిరిగొచ్చేసరికి కారు అద్దం పగల కొట్టి అందులోని రూ.1.2 లక్షల నగదు, ల్యాప్‌టాప్, చెక్కు బుక్‌ను ఎత్తుకెళ్లారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

News January 22, 2025

ప్రకాశం జిల్లాలో ప్రమాదాలకు నిలయంగా.. కట్టెల లోడ్లు.!

image

ప్రకాశం జిల్లాలో ప్రమాదాలకు నిలయంగా కట్టెల లోడ్లు తయారవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఏటా 7నెలలు పొగాకు కాలం నడుస్తుంది. జనవరి-ఏప్రిల్ మధ్య పొగాకు కాల్పు దశకు వస్తోంది. ఈ సమయంలో రైతులు కర్రల లోడ్లు తీసుకెళ్తుంటారు. దీంతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. <<15219057>>నిన్న జరిగిన<<>> కట్టెల లోడు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. <<15167553>>ఈనెల 16న<<>> పచ్చాకు లోడుతో వెళ్తుండగా ఇద్దరు చనిపోయారు. ఈ ఘటనలపై మీ కామెంట్.