News December 31, 2024

టీడీపీ సభ్యత్వ నమోదుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించండి: రామ్మోహన్

image

ప్రతి రెండేళ్లకు ఒకసారి వచ్చే అరుదైన అవకాశం టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమమని ఎంపీ, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. సభ్యత్వ నమోదుకి డిసెంబర్ 31 చివరి రోజు కావడంతో పార్టీ సభ్యత్వ నమోదు కాని గ్రామాలలో, వార్డుల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాల్సిందిగా కోరారు. సభ్యత్వం తీసుకుంటే ప్రమాద బీమా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, అభిమానులు పాల్గొనవలసిందిగా కోరారు.

Similar News

News January 24, 2025

కంచిలి: సోంపేట రైల్వేస్టేషన్‌లో రెండు పూటలా రిజర్వేషన్

image

కంచిలి మండల కేంద్రంలోని సోంపేట రైల్వేస్టేషన్‌లో నాలుగు నెలలుగా నెలకొన్న సమస్యకు శుక్రవారం పరిష్కారం లభించింది. సోంపేట రైల్వేస్టేషన్‌లో రెండో పూట రిజర్వేషన్ కౌంటర్‌ను రైల్వే అధికారులు పునఃప్రారంభించారని ఈస్ట్ కోస్ట్ రైల్వేజోన్ జెడ్ఆర్యూసీసీ మెంబర్ శ్రీనివాస్ తెలిపారు. నాలుగు నెలలుగా నెలకొన్న సమస్య పరిష్కారం పట్ల రైల్వే కమిటీ సభ్యులు, ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు.

News January 24, 2025

పాతపట్నం: యువతి నుంచి ఫోన్‌ కాల్.. నిండా ముంచారు

image

హనీ ట్రాప్‌తో శ్రీకాకుళం జిల్లా పాతపట్నంకు చెందిన రామారావు మోసపోయాడు. ఈనెల 18న ఓ యువతి నుంచి ఫోన్‌ కాల్ వచ్చింది. 19న పెద్దిపాలెం వెళ్తుండగా.. మరోసారి ఆమె నుంచి ఫోన్‌ వచ్చింది. ఇంతలో సంగివలస మూడుగుళ్ల వద్దకు రావాలని యువతి చెప్పగా.. అతడు అక్కడికి చేరుకోగానే నలుగురు వ్యక్తులు ఆయనను బైక్ ఎక్కించుకొని విజయనగరం వైపు తీసుకుపోయారు. మధ్యలో ఆయన వద్ద నుంచి రూ.50 వేల నగదు దోచుకున్నారు.

News January 23, 2025

జలుమూరు: బ్యానర్‌లో ఎమ్మెల్యే ఫొటో లేకపోవడంపై ఆక్షేపణ

image

జలుమూరు మండలం లింగాలవసలో నిర్వహించిన పశు వైద్య శిబిరం కార్యక్రమంలో బ్యానర్లపై ఎమ్మెల్యే ఫోటో లేకపోవడంపై టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఫొటో ఎందుకు ముద్రించలేదంటూ టీడీపీ నేతలు ప్రశ్నించారు. ఇది ప్రొటోకాల్‌ను ఉల్లంఘించడమేనని ఫైర్ అయ్యారు. అయితే బ్యానర్లు డైరెక్టరేట్ నుంచి వచ్చాయని స్థానికంగా తయారు చేసి ఉంటే ఎమ్మెల్యే ఫొటో ముద్రించే వాళ్లమని ఏడి రాజగోపాల్ రావు వివరణ ఇచ్చారు.