News March 12, 2025

టీబి అంతం మన పంతం: MHBD TB ప్రోగ్రాం అధికారి

image

టీబీ ముక్త్ భారత్‌లో భాగంగా మంగళవారం ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో ప్రిన్సిపల్ లీల అధ్యక్షతన ఏర్పాటుచేసిన కార్యక్రమానికి జిల్లా టీబీ ప్రోగ్రాం అధికారి విజయ్ కుమార్ పాల్గొన్నారు. రెండు వారాలకు మించి దగ్గు ఉంటే పరీక్షలు చేయించుకోవాలన్నారు. టీబీ అంతం.. మన పంతమని పేర్కొన్నారు. నర్సింగ్ కాలేజ్ ట్యూటర్స్ రమాదేవి, శిరీష, చంద్రిక, శృతి తదితరులు పాల్గొన్నారు.

Similar News

News October 28, 2025

పెయ్య దూడకు జున్నుపాలను నిర్లక్ష్యం చేయొద్దు

image

పశువు ఈనిన ఒక గంట లోపల దూడకు జున్ను పాలు తాగించాలి. ఈ సమయంలోనే జున్ను పాలలో రోగనిరోధక శక్తిని కలిగించే యాంటీబాడీస్‌ను దూడ వినియోగించుకునే శక్తిని కలిగి ఉంటుంది. ఆలస్యమైతే ఈ యాంటీబాడీస్‌ను జీర్ణించుకొనే శక్తి పెయ్యలో తగ్గుతుంది. జున్ను పాలలో తేలికగా జీర్ణమయ్యే మాంసకృత్తులు, విటమిన్-ఎ ఎక్కువగా ఉంటాయి. జున్ను పాలు తాగిన దూడలు 6 నెలల వయసు వరకు రోగనిరోధక శక్తిని ఎక్కువగా కలిగి ఉండి త్వరగా పెరుగుతాయి.

News October 28, 2025

కల్పసూత్రాల్లో ఏం ఉంటాయంటే..?

image

కర్మలను ఆచరించే విధానాన్ని, ఆంతర్యాన్ని తెలిపేవే కల్పసూత్రాలు. ఇవి ఏ మంత్రం ఎక్కడ వాడాలి, క్రతువులకు కావలసిన సామగ్రి, పండితుల సంఖ్యను వివరిస్తాయి. ఇవి 3 రకాలు. యజ్ఞయాగాదుల శ్రుతి ఆధారిత క్రతువులను వివరించేవి శ్రౌతసూత్రాలు. గర్భాదానం, వివాహం, ఉపనయనం వంటి గృహస్థ ధర్మాలకు సంబంధించినవి గృహ్యసూత్రాలు. రాజధర్మాలు, ఆశ్రమ ధర్మాలు, నీతి నియమాలను బోధిస్తూ ధర్మమార్గంలో నడిపించేవి ధర్మ శాస్త్రాలు.<<-se>>#VedikVibes<<>>

News October 28, 2025

348 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్‌లో 348 GDS ఎగ్జిక్యూటివ్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. డిగ్రీ అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఏపీలో 8, తెలంగాణలో 9 పోస్టులు ఉన్నాయి. అభ్యర్థుల వయసు 20 నుంచి 35ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.750. విద్యార్హత, రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.ippbonline.com/