News March 12, 2025
టీబి అంతం మన పంతం: MHBD TB ప్రోగ్రాం అధికారి

టీబీ ముక్త్ భారత్‌లో భాగంగా మంగళవారం ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో ప్రిన్సిపల్ లీల అధ్యక్షతన ఏర్పాటుచేసిన కార్యక్రమానికి జిల్లా టీబీ ప్రోగ్రాం అధికారి విజయ్ కుమార్ పాల్గొన్నారు. రెండు వారాలకు మించి దగ్గు ఉంటే పరీక్షలు చేయించుకోవాలన్నారు. టీబీ అంతం.. మన పంతమని పేర్కొన్నారు. నర్సింగ్ కాలేజ్ ట్యూటర్స్ రమాదేవి, శిరీష, చంద్రిక, శృతి తదితరులు పాల్గొన్నారు.
Similar News
News March 26, 2025
మంచిర్యాల: ‘యోగ, వ్యాయామం అలవాటు చేసుకోవాలి’

మంచిర్యాల జిల్లా స్థాయి మెంటల్ హెల్త్ అండ్ లీగల్ రైట్స్ అవగాహన కార్యక్రమనికి జిల్లా అదనపు కలెక్టర్ సభావత్ మోతిలాల్ హాజరయ్యారు. నేటి సమాజంలో స్మార్ట్ ఫోన్ వాడకం పెరగడం వల్ల మానవ సంబంధాలు బలహీనపడుతున్నాయన్నారు. స్మార్ట్ ఫోన్ వాడకం తగ్గించి యోగ, వ్యాయామం వంటివి అలవాటు చేసుకోవాలని ఆయన సూచించారు. మానసిక ఒత్తిడికి గురైనప్పుడు సహాయం కోసం ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నంబర్14416ను సంప్రదించాలని సూచించారు.
News March 26, 2025
చిత్తూరు: స్థానిక సంస్థల ఎన్నికలకు సర్వం సిద్ధం

చిత్తూరు జిల్లా పరిధిలో గురువారం నిర్వహించే మండల ప్రజాపరిషత్ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తయినట్లు జడ్పీ సీఈఓ రవికుమార్ తెలిపారు. అయన మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లాలో ఖాళీ అయిన స్థానాలకు మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కోఆప్షన్ సభ్యుల ఎంపికకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
News March 26, 2025
IPLలో సరికొత్త చరిత్ర

IPL 2025 సరికొత్త జోష్‌తో కొనసాగుతోంది. ఇప్పటివరకు జరిగిన ఐదు మ్యాచుల్లో సగటున 3.9 బంతులకు ఫోర్, 9.9 బంతులకు సిక్సర్ నమోదైంది. ఐపీఎల్ ప్రారంభమైన తర్వాత ఈ స్థాయిలో దూకుడుగా ఆడటం ఇదే తొలిసారి. ఇక ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన మ్యాచుల్లో కనీసం 20+ పరుగులు నమోదైన ఓవర్లు 20 ఉన్నాయి. ఇక ప్రారంభంలోనే SRH 286 పరుగులు చేసి 300 పరుగులు కొట్టేస్తామని ఇతర జట్లకు హెచ్చరికలు జారీ చేసింది.