News March 23, 2025
టీబీ విభాగంలో భద్రాద్రికి రెండో బహుమతి

రాష్ట్ర స్థాయిలో క్షయ విభాగంలో ఉత్తమ సేవలందించినందుకు 2024 ఏడాదికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు రాష్ట్రస్థాయిలో రెండో బహుమతి లభించింది. శనివారం రాత్రి హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో మెడికల్ అండ్ హెల్త్ రిజినల్ డైరెక్టర్ డాక్టర్ అనురాధ, రాష్ట్ర క్షయ నియంత్రణ అధికారి డాక్టర్ రాజేశం చేతుల మీదుగా డీఎంహెచ్ఓ డాక్టర్ భాస్కర్ నాయక్, జిల్లా క్షయ నియంత్రణ అధికారి డాక్టర్ బాలాజీ అవార్డు అందుకున్నారు.
Similar News
News April 24, 2025
హిమాచల్ ప్రదేశ్‌లో హైఅలర్ట్

పహల్‌గామ్ ఉగ్రదాడి తరహాలో మరోసారి తీవ్రవాదులు హిమాచల్‌ప్రదేశ్‌లో దాడులకు తెగబడే ప్రమాదం ఉందని ఇంటెలిజెన్స్ అధికారులు హెచ్చరించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. సరిహద్దుల్లో అప్రమత్తంగా ఉండాలని సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు పోలీస్ శాఖను ఆదేశించారు. ముఖ్యంగా జమ్మూకశ్మీర్‌తో బార్డర్‌ను పంచుకునే చంబా, కంగ్రా జిల్లాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని సూచించారు.
News April 24, 2025
బల్లికురవ: రెండు వర్గాల మధ్య ఘర్షణ

బల్లికురవ మండలంలోని రామాంజనేయపురంలో బుధవారం రెండు సామాజిక వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. గ్రామంలో ఇళ్ల వద్ద గతంలో పైప్ లైన్ వేయగా పాడు చేశారని, అలానే ఒక వర్గానికి చెందిన మహిళకు మరో సామాజికవర్గానికి చెందిన యువకుడు ఫోన్ చేస్తున్నారనే కారణాలతో వివాదం మొదలై కొట్లాటకు దారి తీసింది. సమాచారం అందుకున్న బల్లికురవ పోలీసులు రామాంజనేయపురం వెళ్లి ఇరు వర్గాలను చెదరగొట్టారు.
News April 24, 2025
ఓటముల్లో SRH సెంచరీ

SRH ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. IPL హిస్టరీలో 100 ఓటములను ఎదుర్కొన్న ఏడో టీమ్‌గా నిలిచింది. తొలి ఆరు స్థానాల్లో ఢిల్లీ(137), పంజాబ్(137), ఆర్సీబీ(132), KKR(125), ముంబై(121), రాజస్థాన్(113), CSK(105) ఉన్నాయి. SRHకు ముందు 2008-12 మధ్య హైదరాబాద్ వేదికగా ఉన్న డెక్కన్ ఛార్జర్స్ 75 మ్యాచ్‌లలో 46సార్లు ఓడిపోయింది.