News June 30, 2024
టీమిండియా గెలుపు.. అంబరాన్నంటిన సంబరాలు

టీమిండియా T20 వరల్డ్ కప్ గెలవడంతో ఉమ్మడి నిజామాబాద్ వ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటాయి. బిక్నూరులో అర్ధరాత్రి యువకులు ద్విచక్ర వాహనం ర్యాలీ నిర్వహించి స్థానిక సినిమా టాకీస్ చౌరస్తా వద్ద సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను చేత బూని యువకులు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పిట్లంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద క్రికెట్ అభిమానులు టపాసులు కాల్చి సంబురాలు జరుపుకున్నారు.
Similar News
News July 11, 2025
NZB: కూలీల కొరత.. పొరుగు రాష్ట్రాల నుంచి బారులు

నిజామాబాద్ జిల్లాలో కూలీల కొరత వేధిస్తోంది. ఇక్కడి వారు ఉపాధి కొసం మలేషియా, కెనడాతో పాటు పలు దేశాలకు వలస వెళ్తున్నారు. దీంతో జిల్లాలో కూలీల కొరత ఏర్పడుతుంది. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే వలస కార్మికులకు జిల్లా రైతులు ఆహ్వానం పలుకుతున్నారు. వరినాట్లు, హమాలీ పనులకు బిహార్, బెంగాల్, మహరాష్ట్ర నుంచి కూలీలు వస్తున్నారు. ఒక ఎకరం వరినాట్లు వేస్తే రూ. 4000 నుంచి రూ. 5000 వరకు కూలీ చెల్లిస్తున్నారు.
News July 11, 2025
నిజామాబాద్: వామ్మో.. డెంగ్యూ

నిజామాబాద్ జిల్లాలో డెంగ్యూ కేసులు బెంబెలెత్తిస్తున్నాయి. గత నెలలో 25 కేసులు నమోదవ్వగా ఈనెలలో 15 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు డెంగీ, సీజనల్ వ్యాధులు, విష జ్వరాలపై వైద్యాశాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నప్పటికీ కేసులు నమోదవుతున్నాయి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవటంతో పాటు కాచిచల్లార్చిన నీటిని తాగాలని వైద్యులు సూచిస్తున్నారు.
News July 11, 2025
వర్ని: పెన్షన్ డబ్బులు ఇవ్వలేదని తల్లి హత్య..!

వర్ని మండలంలో దారుణం జరిగింది. జలాల్పూరులో పెన్షన్ డబ్బుల కోసం కన్నతల్లినే కొడుకు హత్య చేశాడు. SI మహేశ్ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సాయవ్వ(57)ను ఆమె కొడుకు సాయిలు పెన్షన్ డబ్బులు ఇవ్వాలని గొడవకు దిగాడు. ఈ క్రమంలో తల్లిపై కుర్చి, రాయితో దాడి చేసి పారిపోయాడు. ఆమెకు తీవ్రగాయాలు కావడంతో చుట్టుపక్కల వారు బోధన్ ఆస్పత్రికి తరలించారు. సాయవ్వను పరిశీలించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు.