News April 8, 2025
టీయూలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్!

తెలంగాణ యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వర్సిటీలో మొత్తం 89 పోస్టులకు గానూ 48 మంది మాత్రమే పని చేస్తున్నారు. ఇంకా 41 ఖాళీలు ఉన్నాయి. అకడమిక్ రికార్డ్, పరిశోధనలు, విషయ పరిజ్ఞానం, బోధన నైపుణ్యం, ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. కాగా ఈ పోస్టుల్లో ఎన్ని భర్తీ చేస్తారనే విషయాన్ని ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు.
Similar News
News April 20, 2025
NZB: ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించాలి: సీపీ

భవనాలు, పరిశ్రమలు, పాఠశాలలు, దుకాణాల్లో ఖచ్చితంగా ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించాలని సీపీ సాయి చైతన్య సూచించారు. అగ్నిమాపక శాఖ వారోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని ఆదివారం నిజామాబాద్ ఫైర్స్టేషన్లో నిర్వహించారు. అనంతరం పదవీ విరమణ చేసిన లీడింగ్ ఫైర్మెన్లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఫైర్ ఆఫీసర్ నర్సింగ్ రావు, సూపరింటెండెంట్, సిబ్బంది పాల్గొన్నారు.
News April 20, 2025
బోధన్ డంపింగ్ యార్డ్ అగ్ని ప్రమాదంపై సబ్ కలెక్టర్ ఆరా

బోధన్ మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్‌లో శనివారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాద స్థలాన్ని బోధన్ సబ్-కలెక్టర్ వికాస్ మహతో పరిశీలించారు. మంటలను అదుపు చేసి, వీలైనంత త్వరగా ఆర్పడానికి తక్షణ అవసరమైన చర్యలు, అలాగే జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. మరోసారి ఇలా జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బోధన్ మున్సిపల్ కమిషనర్‌తో వెంకట నారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.
News April 20, 2025
NZB: రేపు ప్రజావాణి రద్దు

ప్రజా సమస్యల పరిష్కార నిమిత్తం ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహిస్తున్న ప్రజావాణి రద్దయ్యింది. సోమవారం జిల్లా కేంద్రంలో రైతు మహోత్సవం ప్రారంభోత్సవం ఉన్నందున ప్రజావాణిని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 28 నుంచి తిరిగి యథావిధిగా ప్రజావాణి ఉంటుందని స్పష్టం చేశారు.