News April 8, 2025
టీయూలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్!

తెలంగాణ యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వర్సిటీలో మొత్తం 89 పోస్టులకు గానూ 48 మంది మాత్రమే పని చేస్తున్నారు. ఇంకా 41 ఖాళీలు ఉన్నాయి. అకడమిక్ రికార్డ్, పరిశోధనలు, విషయ పరిజ్ఞానం, బోధన నైపుణ్యం, ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. కాగా ఈ పోస్టుల్లో ఎన్ని భర్తీ చేస్తారనే విషయాన్ని ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు.
Similar News
News January 11, 2026
NZB: ‘నిరంతర ప్రక్రియగా అభివృద్ధి పనులు’

CM రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజల సౌకర్యార్థం అభివృద్ధి పనులను నిరంతర ప్రక్రియగా చేపడుతోందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ, MLC మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. నిజామాబాద్‌లోని వివిధ డివిజన్లలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, అదనపు కలెక్టర్ అంకిత్ తదితరులతో కలిసి అభివృద్ధి పనులకు ఆదివారం శంకుస్థాపనలు చేశారు.
News January 11, 2026
తాడికొండలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకుల మృతి

తాడికొండ (మ) లాం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి రోడ్డు పక్కన ఉన్న చింత చెట్టును కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తుళ్లూరుకి చెందిన అఖిల్ (19), తరుణ్(17) అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు గుంటూరు GGHలో చికిత్స పొందుతున్నారు. తుళ్లూరు నుంచి ఐదుగురు యువకులు తాడికొండ YCP ఇన్ఛార్జ్ డైమండ్ బాబును కలిసి తిరిగి వచ్చే సమయంలో ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు.
News January 11, 2026
రేపు మదనపల్లిలో స్పందన కార్యక్రమం

అన్నమయ్య జిల్లా ప్రజల సమస్యలను నేరుగా విని పరిష్కరించేందుకు సోమవారం మదనపల్లిలో స్పందన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. స్థానిక DSP కార్యాలయంలో జరిగే ఈ కార్యక్రమంలో జిల్లా SP ధీరజ్ స్వయంగా పాల్గొని బాధితుల నుంచి అర్జీలను స్వీకరిస్తారు. జిల్లా వ్యాప్తంగా వివిధ సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారు తమ సమస్యలకు సంబంధించిన అర్జీతో మదనపల్లిలోని డీఎస్పీ కార్యాలయానికి రావాలని పోలీసులు సూచించారు.


