News April 16, 2025

టీయూ పీజీ సెమిస్టర్ ఫలితాలు విడుదల

image

టీయూ పరిధిలోని పీజీ & ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ APE, IMBA, IPCH కోర్సుల I,&IIIవ సెమిస్టర్ ఫలితాలను వర్సిటీ వీసి ప్రొ.యాదగిరి రావు, రిజిస్ట్రార్ ప్రొ.యాదగిరి చేతుల మీదుగా మంగళవారం విడుదల చేశారు. విద్యార్థులు పూర్తి వివరాలను వర్సిటీ వెబ్సైట్‌లో చూడాలన్నారు. పరీక్షల నియంత్రణ అధికారి ప్రొ.సంపత్ కుమార్, అడిషనల్ కంట్రోలర్ ప్రొ.సంపత్, ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొ.చంద్రశేఖర్ ఉన్నారు.

Similar News

News October 24, 2025

MDK: ఈ సర్వేలో మీ అభిప్రాయాలు తెలపండి..!

image

తెలంగాణ రాష్ట్ర దీర్ఘకాల అభివృద్ధి ప్రణాళిక కోసం ప్రజల అభిప్రాయాలు, ఆశయాలను సేకరించేందుకు ప్రభుత్వం సర్వేను ప్రారంభించింది. రైతులు, ఇతర పౌరులు మీ అమూల్యమైన అభిప్రాయాలను ఈ సర్వే ఫారం ద్వారా తెలియజేసి తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడాలని అధికారులు పేర్కొన్నారు. ఈ లింక్ https://www.telangana.gov.in/telanganarising/ ఓపెన్ చేసి అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చి అభిప్రాయాలను తెలపాలని పేర్కొన్నారు.

News October 24, 2025

రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష

image

రాష్ట్రంలో కీలక రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై రైల్వే ఉన్నతాధికారులతో శుక్రవారం కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ భేటీ అయ్యారు. నర్సాపురం-కోటిపల్లి, నర్సాపురం-మచిలీపట్నం పెండింగ్ రైల్వే ప్రాజెక్ట్ పనులపై సమీక్షించారు. నర్సాపురం – అరుణాచలం ఎక్స్‌ప్రెస్ రెగ్యులర్ చేయాలన్నారు. నరసాపురం-వారణాసి కొత్త రైలుకు కీలక ప్రతిపాదన, వందే భారత్‌కు తాడేపల్లిగూడెంలో హాల్ట్ ఇవ్వాలన్నారు.

News October 24, 2025

ఓయూ: MA ఇంటర్నేషనల్ స్టడీస్ పరీక్షా తేదీల ఖరారు

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని MA ఇంటర్నేషనల్ స్టడీస్ పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. ఈ కోర్సు రెగ్యులర్ పరీక్షలను వచ్చే నెల 6వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్‌సైట్ www.osmania.ac.inలో చూడొచ్చని సూచించారు.