News February 25, 2025
టీసీ వరుణ్‌కు కీలక బాధ్యతలు

జనసేన ఆవిర్భావ వేడుకలకు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఆ పార్టీ సమన్వయకర్తలను నియమించింది. అనంతపురం పార్లమెంట్‌కు టీసీ వరుణ్, హిందూపురం పార్లమెంట్‌కు చిలకం మధుసూదన్ రెడ్డి నియమితులయ్యారు. వీరు నియోజకవర్గాల నేతలతో సమన్వయం చేసుకుని మార్చి 14న పిఠాపురంలో జరగనున్న ఆవిర్భావ వేడుకలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది.
Similar News
News March 19, 2025
హిందూపురం వ్యక్తి దారుణ హత్య

శ్రీ సత్యసాయి జిల్లా మలుగూరు సమీపంలో హిందూపురానికి చెందిన సద్దాం(35) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మంగళవారం రాత్రి ఈ ఘటన జరగగా.. బుధవారం ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. హిందూపురం రూరల్ పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
News March 19, 2025
ఆటో ప్రమాదంలో ఒకరు మృతి

తాడిపత్రి మండలంలోని సజ్జలదిన్నె వద్ద జరిగిన ఆటో రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. తాడిపత్రిలోని శ్రీనివాసపురానికి చెందిన రసూల్ బేగం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. నంద్యాల జిల్లా పేరు సోమల గ్రామానికి మిర్చి కోసేందుకు వెళ్లి వస్తున్న సందర్భంలో ఆటో బోల్తా పడటంతో మృతి చెందింది.
News March 19, 2025
300 సీసీ కెమెరాలు వితరణ.. జ్ఞాపికలు అందజేసిన ఎస్పీ

రూ.33 లక్షల విలువ చేసే 300 అత్యాధునిక సోలార్ బేస్డ్ సీసీ కెమేరాలను మొబిస్ ఇండియా మాడ్యుల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారు జిల్లా ఎస్పీ జగదీశ్ సమక్షంలో ఆత్మకూరు పోలీసులకు అందజేశారు. దాతలైన హ్యుండాయ్ మొబీస్ కంపెనీ ప్రతినిధులకు జిల్లా ఎస్పీ జ్ఞాపికలు అందజేశారు. ఆత్మకూరు, ఇటుకలపల్లి పోలీసు స్టేషన్ల పరిధిలోని గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు.