News November 25, 2024

టెండర్ల ఆహ్వానంపై విశాఖ ఎంపీ స్పందన

image

దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యాలయం నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించడంపై విశాఖ ఎంపీ శ్రీభరత్ స్పందించారు. ఇది ఎన్డీఏ ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రతిబింబిస్తున్నట్లు ఎంపీ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. జోన్ స్థాపనలో కీలకపాత్ర పోషించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ జోన్ ద్వారా ఉత్తరాంధ్రకు భారీ ఆర్థిక ప్రయోజనాలు అందుతాయని అన్నారు.

Similar News

News October 23, 2025

జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ పలు అభివృద్ధి పనులకు ఆమోదం

image

జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం మేయర్ సమక్షంలో బుధవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశంలో 205 ప్రధాన అంశాలు, 12 టేబుల్ అజెండాలతో మొత్తం 217 అంశాలు పొందుపరిచారు. వాటిలో 4 అంశాలను వాయిదా వేసి 213 అంశాలకు ఆమోదం తెలిపారు. గాజువాక ప్రాంతానికి చెందిన స్నేక్ క్యాచర్ కిరణ్‌పై అవినీతి ఆరోపణలు వస్తున్నందున అతనిని విధుల నుంచి తొలగించాలని స్థాయి సంఘం సభ్యులు అధికారులకు సూచించారు.

News October 22, 2025

విశాఖ రైతు బజార్లలో డ్రా ద్వారా 129 మందికి స్టాల్స్ మంజూరు

image

విశాఖలోని రైతు బజార్లలో స్టాల్స్ కేటాయింపుల కోసం డ్రా నిర్వహించారు. దరఖాస్తు చేసిన వారిలో 129 మంది రైతులకు రైతు కార్డులు మంజూరు చేసినట్లు జేసీ మయూర్ అశోక్ తెలిపారు. డ్రా ప్రక్రియను కలెక్టరేట్‌లో అధికారులు, రైతుల సమక్షంలో నిర్వహించారు. ఎంపికైన వారికి త్వరలో రైతు బజార్లలో స్టాల్స్ కేటాయించనున్నారు.

News October 22, 2025

గవర్నర్‌కు స్వాగతం పలికిన జిల్లా అధికారులు

image

రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ 2 రోజుల పర్యటన నిమిత్తం బుధవారం సాయంత్రం విశాఖ చేరుకున్నారు. ఎయిర్ పోర్ట్‌లో ఆయనకు కలెక్టర్ హరేంధిర ప్రసాద్, సీపీ శంఖబ్రత బాగ్చి,ఇతర అధికారులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి పీఎంపాలెం వెళ్లారు.