News November 25, 2024
టెండర్ల ఆహ్వానంపై విశాఖ ఎంపీ స్పందన
దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యాలయం నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించడంపై విశాఖ ఎంపీ శ్రీభరత్ స్పందించారు. ఇది ఎన్డీఏ ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రతిబింబిస్తున్నట్లు ఎంపీ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. జోన్ స్థాపనలో కీలకపాత్ర పోషించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ జోన్ ద్వారా ఉత్తరాంధ్రకు భారీ ఆర్థిక ప్రయోజనాలు అందుతాయని అన్నారు.
Similar News
News December 4, 2024
విశాఖ: ప్రమాదవశాత్తు గాయపడ్డ అంగన్వాడీ టీచర్
విశాఖలో బుధవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. అక్కయ్యపాలెంలోని 43వ వార్డు శ్రీనివాసనగర్‌లో అంగన్వాడీ టీచర్ రహీమున్నీసా బేగం ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదంలో గాయపడింది. స్థానికులు సమాచారం మేరకు 4వ పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలిని ఆసుపత్రికి తరలించి వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News December 4, 2024
విశాఖ జూలో జిరాఫీ జంట సందడి
విశాఖ ఇందిరా గాంధీ జూలాజికల్ పార్క్‌లో సుమారు మూడేళ్ల మగ, ఐదేళ్ల ఆడ జిరాఫీ జంట సందర్శకులను అలరిస్తూ సందడి చేస్తున్నాయి. ఇటీవల కోల్‌కతా జూ నుంచి తీసుకొచ్చిన ఈ జిరాఫీల జంట విశాఖ వాతావరణానికి అలవాటు పడి “నీకు నేను.. నాకు నీవు”అనే రీతిలో వాటి హావభావాలతో పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. విశాఖ జూకు ఈ యువ జిరాఫీ జంట స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలుస్తోంది.
News December 4, 2024
విశాఖలో స్వల్ప భూప్రకంపన..!
రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో స్వల్ప భూ ప్రకంపనలతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. దీంతో ఇళ్లు, అపార్ట్‌మెంట్ల నుంచి బయటకు పరుగులు తీశారు. విశాఖలోని అక్కయ్యపాలెం సహా పలు ప్రాంతంలో భూమి కంపించిందని స్థానికులు తెలిపారు. మరి మీ ప్రాంతంలోనూ భూ ప్రకంపనలు వచ్చాయా?