News February 18, 2025

టెక్కలిలోని హాస్టళ్లలో నిఘా కరవు

image

టెక్కలిలోని ఓ ప్రభుత్వ వసతి గృహంలో ఓ ఇంటర్ విద్యార్థిని గర్భం దాల్చిందన్న వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే బాలికల హాస్టళ్లలో అధికారుల పర్యవేక్షణ, సీసీ కెమెరాల నిఘా లేకపోవడంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో వార్డెన్లు, సిబ్బందితో పాటు విద్యార్థినుల రాకపోకలను గమనించడం లేదని , అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Similar News

News October 13, 2025

ఎచ్చెర్ల: RBK నిర్మాణంపై కలెక్టర్ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు

image

ఎచ్చెర్ల మండలం, బడివానిపేట గ్రామంలో నిర్మించ తలపెట్టిన RBK కేంద్రంతో చిన్నపిల్లలు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సోమవారం జడ్పీ సమావేశ మందిరంలో జరిగిన గ్రీవెన్స్‌లో ఫిర్యాదు అందింది. గ్రామస్థులు ఈ సమస్యను అధికారులకు వివరించారు. నిర్మాణంలో భాగంగా పిల్లర్స్ వేసి ఉంచడంతో 48 మంది కుటుంబాలకు చెందిన పిల్లలు అక్కడ ఆడుకుంటారని, దీంతో ప్రమాదాలు చేసుకుంటున్నాయని తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

News October 13, 2025

నేడు విధుల్లో చేరనున్న నూతన ఉపాధ్యాయులు

image

శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి మెగా డీఎస్సీ ద్వారా ఎంపికైన 528 మంది నూతన ఉపాధ్యాయులు సోమవారం విధుల్లో చేరనున్నారని DEO రవిబాబు తెలిపారు. వీరికి ఆన్‌లైన్ ద్వారా కౌన్సిలింగ్ నిర్వహించి పాఠశాలలు కేటాయించి, పోస్టింగ్ ఆర్డర్స్ జారీచేశామని వెల్లడించారు. వీరంతా సోమవారం విధుల్లో చేయనుండడంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్య అందుతుందని భావిస్తున్నామని DEO పేర్కొన్నారు.

News October 13, 2025

SKLM: ‘ధాన్యం రవాణా వాహనాలకు GPS తప్పనిసరి’

image

రైతులు వద్ద ధాన్యం కొన్న తరువాత రవాణా చేసే ప్రతి వాహనానికి కచ్చితంగా జీపీఎస్ GPS పరికరం అమర్చుకోవాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. దీనికోసం ఆసక్తి ఉన్న వాహనదారులు ముందుగా రూ.3068 చెల్లించి GPS యంత్రాన్ని అమర్చుకోవాలని సూచించారు. రైతుసేవా కేంద్రాల వద్ద వాటి వివరాలు నమోదు చేయించుకోవాలని పేర్కొన్నారు.