News October 20, 2024
టెక్కలిలో దివ్వెల మాధురికి నోటీసులు
టెక్కలిలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సన్నిహితురాలు దివ్వెల మాధురికి ఆదివారం తిరుపతి పోలీసులు నోటీసులు అందించారు. తిరుమల మాడ వీధుల్లో ఫొటో షూట్, రీల్స్ చేశారని టీటీడీ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొద్ది రోజుల క్రితం తిరుపతి పోలీసులు మాధురిపై కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఆదివారం టెక్కలిలో మాధురికి నోటీసులు అందించారు. దీంతో దువ్వాడ శ్రీనివాస్, మాధురి అంశం మరలా చర్చనీయాంశంగా మారింది.
Similar News
News November 12, 2024
ROB భూసేకరణ వేగవంతం చేయాలి: కలెక్టర్ దినకర్
శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండకర్, జెసి ఫర్మాన్ అహ్మద్ ఖాన్ మంగళవారం వివిధ జిల్లాస్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ మేరకు ఆర్ఓబీకి సంబంధించిన భూసేకరణ త్వరితగతిన పూర్తి చేయాలని, వచ్చే ఏడాది మార్చి నెలాఖరు నాటికి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే ట్రాన్స్‌కోకు సంబంధించిన చెల్లింపులు చేయాల్సి ఉందని వాటిని త్వరలోనే ఇస్తామన్నారు.
News November 12, 2024
శ్రీకాకుళం: నేడే చివరి అవకాశం
డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ డిగ్రీ 3వ సెమిస్టర్ పరీక్ష ఫీజు చెల్లించేందుకు గడువు ఇవాళ్టి(మంగళవారం)తో ముగుస్తుంది. పరీక్ష ఫీజును అక్టోబర్ 29 నుంచి చెల్లించేందుకు అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రాక్టికల్స్ నవంబర్ 18వ తేదీ నుంచి 23వ తేదీ వరకు జరుగుతాయి. సెమిస్టర్ పరీక్షలు ఈనెల 28వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.
News November 12, 2024
వంశధారకు రూ.63.50 కోట్ల కేటాయింపు
శ్రీకాకుళం జిల్లాలోని పలు ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయించింది. అత్యధికంగా వంశధార ప్రాజెక్ట్ ఫేజ్-2 పనులకు రూ.63.50 కోట్లు ప్రతిపాదించింది. మహేంద్ర తనయ నదిపై ఆఫ్‌షోర్ ప్రాజెక్ట్ నిర్మాణానికి రూ.35 కోట్లు కేటాయించింది. తోటపల్లి, నారాయణపురం ఆనకట్ట పనులకు రూ.32.84 కోట్లు ప్రకటించింది. వీటితో పాటు జిల్లాకు ప్రత్యేకంగా పోలీస్ బెటాలియన్ కేటాయించింది. కొత్తగా సైబర్ స్టేషన్ సైతం రానుంది.