News May 3, 2024

టెక్కలిలో మహిళకు కరెంట్ షాక్

image

టెక్కలి- మెలియాపుట్టి రోడ్డులోని ఓ రైస్ మిల్లులో పనిచేస్తున్న పోలాకి సుందరమ్మ అనే మహిళ శుక్రవారం విద్యుత్ షాక్‌కు గురై తీవ్రగాయాలయ్యాయి. మండాపోలం కాలనీకి చెందిన సుందరమ్మ మిల్లులో పని చేస్తుండగా విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ వద్ద కరెంట్ షా్క్ తగిలింది. గమనించిన స్థానికులు మహిళను చికిత్స నిమిత్తం టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు.

Similar News

News January 3, 2026

దువ్వాడ అడుగు ఎటువైపు ?

image

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ రాజకీయ ప్రయాణంపై శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుతం చర్చ జరుగుతోంది. బలమైన సామాజిక వర్గం నుంచి పాలిటిక్స్‌లోకి ఆయన వచ్చారు. ఏడాది క్రితం ఆయన వైసీపీ నుంచి సస్పెన్షన్‌కు గురికాగా.. పలు ఇంటర్వ్యూల్లో ఇది తాత్కాలికమేనని చెప్పుకొచ్చారు. జిల్లాలో మారుతున్న పొలిటికల్ సమీకరణాల దృష్ట్యా BJPలో చేరుతారని ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై దువ్వాడ నుంచి స్పష్టత రావాల్సి ఉంది.

News January 3, 2026

శ్రీకాకుళం: Way2Newsకు రిపోర్టర్లు కావలెను

image

శ్రీకాకుళం జిల్లాలో ఇచ్ఛాపురం, సోంపేట, పలాస, నందిగాం, గార, కొత్తూరు, జి.సిగడాం మండలాల నుంచి రిపోర్టర్లుగా పని చేసేందుకు Way2News దరఖాస్తులను స్వీకరిస్తోంది. మీడియా రంగంలో అనుభవం ఉన్న వారు ఈ <>లింక్‌పై<<>> క్లిక్ చేసి మీ వివరాలను నమోదు చేసుకోండి.

News January 3, 2026

మందస: గోడ కూలి కార్మికురాలు మృతి

image

మందస మండలం బేతాళపురంలో శనివారం విషాదం చోటుచేసుకుంది. గ్రామంలో ఓ ఇల్లు నిర్మాణ పనులు చేపడుతుండగా..బత్తిని కాంతమ్మ (39) అనే భవన నిర్మాణ కార్మికురాలిపై ఒక్కసారిగా గోడ కూలిపోయింది. తీవ్ర గాయాల పాలైన కాంతమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న మందస పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.