News September 20, 2024
టెక్కలిలో రూ.4 కోట్ల విద్యుత్ బకాయి.. పరిశ్రమకు కరెంట్ కట్
టెక్కలి మండలంలోని మెట్కోర్ అల్లాయిస్ పరిశ్రమకు అధికారుల విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. రావివలసలోని ఈ పరిశ్రమ సుమారు రూ.4 కోట్ల మేరకు విద్యుత్ బకాయి పడినట్లు అధికారులు తెలిపారు. దీంతో శుక్రవారం టెక్కలి విద్యుత్ శాఖ అధికారులు పరిశ్రమకు సరఫరాను నిలిపివేశారు. హెచ్.టీ సర్వీస్ పరిధిలో ఉన్న ఈ పరిశ్రమ బకాయిలు కోట్ల రూపాయలలో ఉండటంపై పలువురు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమకు నోటీసులు జారీ చేశారు.
Similar News
News October 5, 2024
శ్రీకాకుళం: రేపటి నుంచి దసరా సెలవులు
డా. బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ, అనుబంధ కాలేజీలకు ఈనెల 7 వ తేదీ నుంచి 12 వ తేదీ వరకూ దసరా సెలవులు (6వ తేదీ ఆదివారం సెలవు ) ప్రకటిస్తూ రిజిస్ట్రార్ పీలా సుజాత శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. వర్సిటీ విద్యార్థులు, అధ్యాపకులకు ఈ సెలవులు వర్తిస్తాయని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, 13వ తేదీ ఆదివారం సెలవు కావడంతో 14 నుంచి తరగతులు పునఃప్రారంభం కానున్నట్లు ఆ ప్రకటనలో సూచించారు.
News October 5, 2024
భువనేశ్వర్ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్తాం: మంత్రి
శ్రీకాకుళం జిల్లాకు చెందిన కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శుక్రవారం భువనేశ్వర్ విమానాశ్రయం టెర్మినల్-1, 2 భవనాలను పరిశీలించారు. భువనేశ్వర్ ఎయిర్‌పోర్ట్ ప్రస్తుత సామర్థ్యం 4.6 మిలియన్లు ఉండగా.. ఏటా 8 మిలియన్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేలా విస్తరణ పనులు చేపడతామని అధికారులకు తెలిపారు. విమానాశ్రయాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని అన్నారు.
News October 4, 2024
DGP ద్వారకాతిరుమలరావును కలిసిన ఎంపీ కలిశెట్టి
విజయవాడలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర DGP ద్వారకాతిరుమలరావును శుక్రవారం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. విజయనగరం పైడితల్లి అమ్మవారి ఉత్సవాలకు రావాలని డీజీపీని ఆహ్వానించారు. అలాగే ఉత్సవాలకు భారీ బందోబస్తు ఏర్పాటుచేసి శాంతిభద్రతలకు ఎటువంటి లోటు రాకుండా చూసుకోవాలని కోరారు.