News February 23, 2025
టెక్కలిలో రోడ్డు ప్రమాదం

టెక్కలి ఇందిరాగాంధీ కూడలి సమీపంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో బూరగాం గ్రామానికి చెందిన ఇద్దరు భార్యాభర్తలకు గాయాలయ్యాయి. ఇందిరాగాంధీ కూడలి నుంచి అంబేడ్కర్ కూడలి వైపు ద్విచక్రవాహనంపై వెళ్తున్న క్రమంలో ఎదురుగా వస్తున్న ఆటోను ప్రమాదవశాత్తు ఢీకొంది. స్థానికులు క్షతగాత్రులను చికిత్స కోసం టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు.
Similar News
News February 23, 2025
టెక్కలి: ప్రమాదవశాత్తు జారిపడి కూలీ మృతి

టెక్కలి జాతీయ రహదారిపై ఆదివారం ప్రమాదవశాత్తు జారిపడి మెలియాపుట్టి మండలం బంజీరు గ్రామానికి చెందిన గూడ మార్కండరావు(36) అనే కూలీ మృతిచెందాడు. గోడౌన్ నుంచి సరకులను ట్రాక్టర్ ద్వారా తీసుకువెళ్లేందుకు రోజుకూలీ డ్రైవర్‌గా ఉన్న ఈయన ప్రమాదవశాత్తు జారిపడిపోవడంతో తలకు బలమైన గాయమైంది. టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News February 23, 2025
కింజరాపు ఎర్రన్నాయుడుది మచ్చ లేని చరిత్ర : CM

దివంగత మాజీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు జయంతి నేడు. దీనిపై CM ట్విటర్ వేదికగా ఆయన గొప్పతనాన్ని గుర్తుచేసుకున్నారు.’ప్రజా సేవలో తిరుగులేని నిబద్ధత, నిజాయితీ, ఆత్మీయత కలబోసిన నాయకుడు ఎర్రన్నాయుడు గారు.మూడు దశాబ్దాలకు మించి రాజకీయ చరిత్రలో మచ్చలేని చరిత్రను సొంతం చేసుకున్న నా ఆత్మీయ నేస్తం ఎర్రన్నాయుడు జయంతి సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేసుకుందాం!’అని తన Xఖాతాలో రాసుకొచ్చారు.
News February 23, 2025
ఆమదాలవలస : వెలవెలబోతున్న చికెన్ షాపులు

జిల్లాలోని బర్డ్ ఫ్లూ భయంతో చికెన్ షాపులు వెల వెల పోతున్నాయి. గత కొన్ని రోజులుగా చికెన్ వినియోగం తగ్గడం వలన ఆమదాలవలసలో కేజీ స్కిన్ లెస్ రూ .150/- గా ఉందని వ్యాపారస్థులు చెబుతున్నారు. ప్రస్తుతం బర్డ్ ఫ్లూ లేకపోయినా.. అమ్మకాలు లేవని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. మరి మీ ప్రాంతంలో చికెన్ ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.