News June 13, 2024
టెక్కలిలో YCP నాయకుడు అరెస్ట్.. రిమాండ్‌కు తరలింపు

టెక్కలికి చెందిన వైసీపీ నాయకుడు నర్సింగ్ నాధ్‌ను బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు టెక్కలి సీఐ పీ పైడయ్య తెలిపారు. గత నెల 13వ తేదీన పోలింగ్ బూత్ వద్ద జరిగిన తగాదా విషయంలో కేసు నమోదు చేసిన టెక్కలి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ సందర్భంగా టెక్కలికి చెందిన నర్సింగ్ నాధ్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టులో రిమాండ్ విధించడంతో నరసన్నపేట ఉప కారాగారానికి తరలించారు.
Similar News
News December 16, 2025
శ్రీకాకుళం ఎస్పీ గ్రీవెన్స్‌కు 46 అర్జీలు

పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమంలో స్వీకరించే అర్జీలు పునరావృతం కాకుండా ఆయా ఫిర్యాదులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి శాశ్వత పరిష్కారం చూపాలని పోలీసు అధికారులను ఎస్పీ కె.వి.మహేశ్వర రెడ్డి ఆదేశించారు. సోమవారం SP కార్యాలయంలో ఎస్పీ ప్రజా ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కార కార్యక్రమం నిర్వహించి వారి సమస్యలు విన్నారు. మొత్తం 46 అర్జీలు స్వీకరించామన్నారు.

News December 15, 2025
శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్ ఇవే

➤కాశీబుగ్గ: ఈనెల 20న జాబ్ మేళా
➤ప్రజలను వైసీపీ తప్పుదోవ పట్టిస్తోంది: అచ్చెన్న
➤శ్రీకాకుళం ఎస్పీ గ్రీవెన్స్‌కు 46 అర్జీలు
➤అభ్యుదయ సైకిల్ యాత్రలో పాల్గొన్న అధికారులు
➤ఇచ్ఛాపురం: 6నెలలు గడిచినా బాధితులకు అందని న్యాయం
➤బొరిగివలసలో లైన్ మ్యాన్‌కు కరెంట్ షాక్
➤ధర్మాన వ్యాఖ్యలు హాస్యాస్పదం: ఎమ్మెల్యే శంకర్