News August 19, 2024
టెక్కలి: ఆందోళన చేస్తూనే సోదరుడుకి రాఖీ
గత కొన్ని రోజులుగా టెక్కలి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద భార్య దువ్వాడ వాణి, కుమార్తె హైందవి ఆందోళన చేస్తున్న విషయం విధితమే. సోమవారం రాఖీ పౌర్ణమి సందర్భంగా హైందవి సోదరుడు రూపాంక్ ఆందోళన చేస్తున్న తన సోదరి హైందవి వద్దకు వచ్చి రాఖీ కట్టించుకొని ఆశీస్సులు తీసుకున్నాడు. తన తండ్రితో విభేదాల మధ్య రాఖీ వేడుకలు నిర్వహించుకున్నారు.
.
Similar News
News September 17, 2024
శ్రీకాకుళంలో TODAY TOP UPDATES
☞ జి.సిగడాం: సంచరిస్తున్న సింహంపై క్లారిటీ
☞ శ్రీకాకుళం: విజయవాడ బాధితులకు రూ.5 లక్షల సాయం
☞ ఇచ్చాపురం: జ్వరంతో 11 ఏళ్ల బాలుడి మృతి
☞ నందిగాం: నీట్ పీజీలో సాయి కిరణ్ ప్రతిభ
☞ శ్రీకాకుళం: రాష్ట్రస్థాయి పోటీల్లో క్రీడాకారుల ప్రతిభ
☞ నరసన్నపేట: ఆర్థిక ఇబ్బందులతో యువకుడి ఆత్మహత్య
☞ శ్రీకాకుళం: బదిలీపై జిల్లాకు ముగ్గురు డీఎస్పీలు
☞ కోర్టు కానిస్టేబుల్ విధులు కీలకం: ఎస్పీ మహేశ్వర రెడ్డి
News September 16, 2024
నరసన్నపేట: ఆర్థిక ఇబ్బందులతో యువకుడి ఆత్మహత్య
నరసన్నపేట పట్టణంలోని కలివరపుపేట వీధికి చెందిన వైశ్యరాజు నాగరాజు(32) సోమవారం ఫ్యానుకు ఉరేసుకుని మృతి చెందాడు. కొన్నేళ్లుగా ఓ వ్యక్తి దగ్గర ఫైనాన్షియల్ కలెక్షన్ ఏజెంట్‌గా పని చేస్తున్నాడని ఆర్థిక ఇబ్బందులు కారణంగానే తాను మృతి చెందాడని తండ్రి లక్ష్మణ రాజు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై దుర్గ ప్రసాద్ తెలిపారు.
News September 16, 2024
నీట్ పీజీలో సిక్కోలు యువకుడి ప్రతిభ
నందిగం మండలం దిమిలాడ గ్రామానికి చెందిన నడుపూరు సాయికిరణ్ నీట్ మెడికల్ పీజీలో రాష్ట్ర స్థాయి 316వ ర్యాంకు సాధించి ప్రతిభ కనబరిచాడు. విజయనగరం మిమ్స్ మెడికల్ కాలేజ్‌లో ఎంబీబీఎస్ పూర్తిచేసిన యువకుడు పీజీ ప్రవేశం కోసం నీట్ పీజీ ప్రవేశ పరీక్షను రాశాడు. ఈ మేరకు డా.ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అధికారులు సోమవారం ఫలితాలు వెల్లడించారు. యువకుడి తండ్రి ఎన్.వి రమణమూర్తి మెరైన్ కానిస్టేబుల్, తల్లి నవనీత గృహిణి.