News May 4, 2024

టెక్కలి: ఆర్మీ ఉద్యోగి ఆత్మహత్య

image

టెక్కలి నియోజకవర్గం బోరుభద్ర గ్రామానికి చెందిన పొందూరు శివ కృష్ణ(32) అనే ఆర్మీ ఉద్యోగి శనివారం విశాఖపట్నం రైల్వే స్టేషన్ దగ్గరలో గల ఒక లాడ్జిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్మీ సెలవులకి వచ్చి సెలవుల అనంతరం తిరుగు ప్రయాణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అసలు శివ కృష్ణ ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Similar News

News February 25, 2026

శ్రీకాకుళం: డయేరియాకు తాగునీరు కలుషితమే కారణమా?

image

శ్రీకాకుళం నగరంలో ప్రస్తుతం డయేరియా సమస్యగా మారింది. డయేరియా ప్రబలిన ప్రాంతాల్లో తాగునీటి సరఫరాను నిలిపివేశారు. తాగునీటి కలుషితమే డయేరియాకు కారణమా అన్న చర్చ సాగుతోంది. నీటి సరఫరా కులాయిల్లోకి డ్రైనేజీ నీరు చేరి ఉంటుందని భావిస్తున్నారు. నీటి నమూనాలను విశాఖ ల్యాబ్‌కు తరలించారు. ల్యాబ్ రిపోర్టు వస్తే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. నీరు కలుషితం అతిసార వ్యాధికి కారణమని అధికారుల ప్రాథమిక అంచనా.

News February 25, 2026

శ్రీకాకుళం: డయేరియాపై ప్రభుత్వం సీరియస్

image

శ్రీకాకుళం పట్టణంలో ప్రబలిన డయేరియాపై ప్రభుత్వం సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం. ఉన్నతస్థాయి నివేదిక తెచ్చుకున్న ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్యంపై అధ్యయనం చేస్తోంది. ముందుగా మున్సిపల్ కమిషనర్‌ను సస్పెండ్ చేసింది. మరికొందరిపై వేటు వేసే అవకాశం ఉందన్న చర్చ అధికార యంత్రాంగంలో కొనసాగుతోంది. ప్రారంభంలో నియంత్రించలేక పోవటం వల్ల కేసులు పెరిగాయి అన్న అభిప్రాయంలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.

News February 25, 2026

SKLM: ‘డయేరియా బాధితులకు మెరుగైన వైద్యం అందించండి’

image

డయేరియా బాధితులకు మరింత మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆసుపత్రి వైద్యులను ఆదేశించారు. జేమ్స్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న డయేరియా బాధితులను బుధవారం ఆయన పరామర్శించారు. వారికి అందిస్తున్న వైద్యం వివరాలను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని అన్నారు.