News February 14, 2025

టెక్కలి: గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

image

టెక్కలి ఆధి ఆంధ్రావీధి జాతీయ రహదారిపై ఉన్న ఎర్రన్నాయుడు సమగ్ర రక్షిత మంచినీటి పథకం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌లో శుక్రవారం సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని ప్రాజెక్టు సిబ్బంది చూసి RWS అధికారులకు, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు, పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News November 18, 2025

గుప్పిడి పేట: సముద్రంలో తెప్ప బోల్తాపడి మత్స్యకారుడు మృతి

image

సముద్రంలో తెప్ప బోల్తా పడడంతో మంగళవారం ఉదయం గుప్పిడిపేటకు చెందిన మత్స్యకారుడు మృతి చెందాడు. పోలాకి మండలం గుప్పిడిపేట నుంచి ముగ్గురు మత్స్యకారులతో వేటకు బయలుదేరిన చెక్క రాజయ్య (45) తెప్పపై సముద్రంలోకి వెళుతుండగా బోల్తా పడి మునిగి మృతి చెందాడు. స్థానికులు మృతదేహాన్ని ఒడ్డుకు తీసుకువచ్చారు. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.

ఎచ్చెర్ల: నన్ను కాపాడండి సార్.. చిన్నారి వేడుకోలు..!

image

ఎచ్చెర్లలోని ముద్దాడకు చెందిన ఐదేళ్ల సింధు నందన్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. వైద్యులు లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయాలని సూచించారు. అయితే ఆ చికిత్సకు రూ.25 లక్షలు ఖర్చవుతుందని తెలిపారు. తమ ఆర్థిత స్థోమత సరిగాలేదని ప్రభుత్వం ఆదుకుని తమ బిడ్డను బతికించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.