News January 29, 2025
టెక్కలి జిల్లా ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం

టెక్కలిలో జిల్లా ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. ఈ నెల 24న సంతబొమ్మాళి మండలం పెద్దమర్రిపాడు గ్రామానికి చెందిన టీ కల్పన అనే మహిళ ఆసుపత్రిలో డెలివరీ అయ్యింది. పుట్టిన మగ శిశువుకు ఆ రోజు మధ్యాహ్నం వ్యాక్సిన్ వేసే క్రమంలో ఇంజక్షన్ సూది శిశువు తొడ భాగంలో ఉండిపోయింది. దీన్ని కుటుంబసభ్యులు మంగళవారం గుర్తించారు. బుధవారం ఆసుపత్రి సిబ్బందిని ప్రశ్నించగా స్పందించలేదని బాధితులు ఆరోపించారు.
Similar News
News January 2, 2026
SKLM: న్యూ ఇయర్ కిక్..రూ. 3.75 కోట్ల మద్యం తాగేశారు

శ్రీకాకుళం జిల్లాలో నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా ఏడాది చివరి రోజు డిసెంబర్ 31న ఉదయం-రాత్రి వరకు మద్యం విక్రయాలు జోరుగా సాగాయి. ఈ అమ్మకాల ద్వారా రూ3.75 కోట్ల ఆదాయం వచ్చినట్లు జిల్లా ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారి సీహెచ్ తిరుపతిరావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 176 మద్యం షాపులు, 9 బార్లు ఉన్నాయని ప్రభుత్వ నిబంధనల మేరకు అమ్మకాలు జరిగాయాన్నారు.
News January 2, 2026
శ్రీకాకుళం: న్యూ ఇయర్ వేడుకలు.. 36 మందిపై డ్రంకెన్ డ్రైవ్ కేసులు

నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా బుధవారం అర్ధరాత్రి వరకు విస్తృత తనిఖీలు నిర్వహించినట్లు ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సోదాల్లో 36 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయని, 15 మందిపై బహిరంగ మద్యం కేసులు నమోదు చేశామన్నారు. రోడ్డు ప్రమాదాలు, నేర నియంత్రణ లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టినట్లు స్పష్టం చేశారు.
News January 2, 2026
SKLM: జూన్ 2 నుంచి రీ సర్వే గ్రామాల్లో పాస్ పుస్తకాలు పంపిణీ

జిల్లాలో రీసర్వే పూర్తయిన గ్రామాల్లో కొత్త పట్టాదారు పాస్పుస్తకాల పంపిణీకి రంగం సిద్ధమైందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి 2 నుంచి రెవెన్యూ గ్రామసభలు ప్రారంభం కానున్నాయి. ఈ కార్యక్రమంలో కోటబొమ్మాళి మండలం అక్కయ్యవలసలో మంత్రి అచ్చెన్న వీటిని పంపిణీ చేయనున్నారు. 652 గ్రామాల్లో 2,54,218 బుక్స్ పంపిణీకి సిద్ధం చేశామన్నారు.


