News January 31, 2025
టెక్కలి జిల్లా ఆసుపత్రిలో అధికారుల విచారణ

టెక్కలి జిల్లా ఆసుపత్రిలో గురువారం అధికారులు విచారణ చేపట్టారు. తాజాగా ఆసుపత్రిలో ఒక శిశువు తొడలో వ్యాక్సిన్ సూది ఉండిపోయిన ఘటనపై జిల్లా డీసీహెచ్ఎస్ డా.కళ్యాణ్ బాబు ఆదేశాల మేరకు నరసన్నపేట ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.సీపాన శీనుబాబు విచారణ చేపట్టారు. విచారణలో సదరు సూది వ్యాక్సిన్ వేసిన ఇంజక్షన్ సూదిగా అధికారులు నిర్ధారించారు. తదుపరి చర్యలకు నివేదిక సమర్పించనున్నట్లు అధికారులు తెలిపారు.
Similar News
News February 19, 2025
SKLM: పోలీసులకు దొరికిన విద్యార్థులు

శ్రీకాకుళంలో గంజాయి కలకలం రేపింది. పాత్రునివలస టిడ్కో కాలనీలో మంగళవారం సాయంత్రం ఆరుగురు సీక్రెట్‌గా గంజాయి తాగుతుండగా రూరల్ పోలీసులు దాడులు చేశారు. దొరికిన వారంతా ఎంబీఏ, ఎంటెక్ విద్యార్థులుగా గుర్తించారు. ఇందులో వైజాగ్‌కు చెందిన ఇద్దరు, శ్రీకాకుళానికి చెందిన నలుగురు ఉన్నారు. సీఐ పైడపునాయుడు మాట్లాడుతూ.. ఇంకా కేసు నమోదు చేయలేదని.. దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు.
News February 19, 2025
పాలకొండకు జగన్ రాక రేపు

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వైసీపీ అధినేత జగన్ రానున్నారు. ఇటీవల జడ్పీ మాజీ ఛైర్మన్ పాలవలస రాజశేఖరం చనిపోయారు. ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్ పాలకొండకు గురువారం రానున్నారు. ఈ మేరకు పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఓ ప్రకటన విడుదల చేశారు. జగన్ పర్యటన విజయవంతం చేయాలని ఆమె కోరారు.
News February 19, 2025
టెక్కలి: జేసీ సమక్షంలో పెండింగ్ అర్జీల పరిష్కారం

టెక్కలి సబ్ కలెక్టరేట్‌లో సోమవారం జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి ఆధ్వర్యంలో టెక్కలి డివిజన్ పెండింగ్‌లో ఉన్న రెవెన్యూ అర్జీలు సమస్యలను పరిష్కరించారు. డివిజన్ పరిధిలోని టెక్కలి, కోటబొమ్మాళి, సంతబొమ్మాలి, పాతపట్నం, హిరమండలం, ఎల్.ఎన్ పేట, కొత్తూరు, సారవకోట మండలాల తహశీల్దార్లు, వీఆర్ఓలు, సర్వేయర్ల సమక్షంలో 260 అర్జీలు పరిష్కరించినట్లు అధికారులు తెలిపారు.