News October 8, 2024
టెక్కలి: జ్వరంతో స్టాఫ్ నర్స్ మృతి

టెక్కలి జిల్లా ఆసుపత్రిలో కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్గా విధులు నిర్వహిస్తున్న ఎం.లక్ష్మీ(35)అనే మహిళ జ్వరంతో మంగళవారం మృతిచెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. గత కొద్ది రోజులుగా డెంగీ జ్వరం లక్షణాలతో బాధపడుతున్న ఆమె మంగళవారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురై మృతిచెందింది. మృతురాలిది నందిగం మండలం సుభద్రాపురం. స్టాఫ్ నర్స్ మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. మృతురాలికి భర్త మాధవరావు, ఇద్దరు కుమార్తెలున్నారు.
Similar News
News November 18, 2025
గుప్పిడి పేట: సముద్రంలో తెప్ప బోల్తాపడి మత్స్యకారుడు మృతి

సముద్రంలో తెప్ప బోల్తా పడడంతో మంగళవారం ఉదయం గుప్పిడిపేటకు చెందిన మత్స్యకారుడు మృతి చెందాడు. పోలాకి మండలం గుప్పిడిపేట నుంచి ముగ్గురు మత్స్యకారులతో వేటకు బయలుదేరిన చెక్క రాజయ్య (45) తెప్పపై సముద్రంలోకి వెళుతుండగా బోల్తా పడి మునిగి మృతి చెందాడు. స్థానికులు మృతదేహాన్ని ఒడ్డుకు తీసుకువచ్చారు. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.

ఎచ్చెర్ల: నన్ను కాపాడండి సార్.. చిన్నారి వేడుకోలు..!

ఎచ్చెర్లలోని ముద్దాడకు చెందిన ఐదేళ్ల సింధు నందన్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. వైద్యులు లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయాలని సూచించారు. అయితే ఆ చికిత్సకు రూ.25 లక్షలు ఖర్చవుతుందని తెలిపారు. తమ ఆర్థిత స్థోమత సరిగాలేదని ప్రభుత్వం ఆదుకుని తమ బిడ్డను బతికించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.