News April 27, 2024

టెక్కలి: ద్విచక్ర వాహనం ఢీ.. మహిళకు గాయాలు

image

టెక్కలి-రావివలస రోడ్డులో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనం ఢీకొని మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక బర్మా కాలనీ వద్ద శనివారం రాత్రి వెనుక నుంచి వచ్చిన ద్విచక్రవాహనం బలంగా ఢీకొనడంతో రోడ్డుపైన పడి తీవ్రంగా గాయాపడింది. క్షతగాత్రురాలిని 108లో చికిత్స కోసం టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Similar News

News February 23, 2026

నందిగాం: కళ్లల్లో కారం కొట్టి.. బంగారంతో పరార్

image

నందిగాం(M) నర్సాపురం గ్రామానికి చెందిన నెయ్యిల మహాలక్ష్మి మెడలో ఆదివారం బంగారం చైన్, పుస్తెలతాడు చోరీ జరిగింది. స్నానం కోసం గ్రామం శివారు చెరువుకు వెళ్తుంటే ఇద్దరు వ్యక్తులు వచ్చి అడ్డగించి కళ్లల్లో కారం కొట్టి మెడలో పుస్తెలతాడు, చైన్ తెంపుకెళ్లిపోయారని బాధితురాలు తెలిపింది. ఆమె భర్త పార్వతీశం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News February 23, 2026

శ్రీకాకుళం: నేటి నుంచి ఇంటర్ పరీక్షలు

image

శ్రీకాకుళం జిల్లాలో నేటి నుంచి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ప్రథమ సంవత్సర విద్యార్థులు 19,850 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 20,019 మందితో కలిపి మొత్తం 39,869 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఈ పరీక్షలు నేటి నుంచి మార్చి 20వ తేదీ వరకు జరగనున్నాయి. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరీక్షా కేంద్రాలలో ఏర్పాట్లు పూర్తి చేశారు.