News October 26, 2024

టెక్కలి: నేడు నూతన ఆర్టీసీ బస్సులు ప్రారంభం

image

టెక్కలి నుంచి ఇచ్ఛాపురం, శ్రీకాకుళం, విశాఖపట్నం, అమలాపురం ప్రాంతాలకు పలు ఆర్టీసీ సర్వీసులు శనివారం ప్రారంభం కానున్నట్లు టెక్కలి ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీనివాసరావు శుక్రవారం తెలిపారు. రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పాల్గొని నూతన ఆర్టీసీ సర్వీసులను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ప్రయాణికులు సౌకర్యార్థం అదనపు సర్వీసులు ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ పేర్కొన్నారు.

Similar News

News November 25, 2025

పలాస జిల్లా లేనట్లేనా..?

image

పలాస కేంద్రంగా ఉద్దానం ఏరియాను జిల్లాను చేయాలనే డిమాండ్ ఇక్కడి ప్రజల్లో ఉంది. గత ప్రభుత్వం పలాసను జిల్లా చేస్తామని ప్రకటించినప్పటికీ.. కేవలం రెవెన్యూ డివిజన్‌గా మార్చి వదిలేసింది. జిల్లాగా ప్రకటించకపోవడంతో పలాసతో పాటు ఇచ్చాపురం నియోజకవర్గ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈప్రభుత్వంలోనైనా ఏర్పాటు అవుతుందని అందరూ భావించారు. దీనిపై అసలు చర్చే లేకపోవడంతో జిల్లా లేనట్టేనని తెలుస్తోంది.

News November 25, 2025

జాతీయస్థాయి పోటీలకు సిక్కోలు విద్యార్థిని ఎంపిక

image

జి.సిగడం కేజీబీవీ ఇంటర్మీడియట్ మొదటి ఏడాది చదువుతున్న విద్యార్థిని ఆర్.స్వాతి జాతీయస్థాయి పరుగు పందేనికి ఎంపికైంది. హర్యానాలో ఈ నెల 26 నుంచి 30 వరకు అండర్-19 క్యాటగిరీలో 4×100 రిలే పరుగు పందెంలో పాల్గొననుంది. రాష్ట్రస్థాయి ఉత్తమ ప్రదర్శనతో జాతీయస్థాయికి ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్ ప్రమీల తెలిపారు. విద్యార్థినిని ఉపాధ్యాయులు ప్రత్యేకంగా అభినందించారు.

News November 24, 2025

శ్రీకాకుళం: ఎస్పీ గ్రీవెన్స్‌కు 52అర్జీలు

image

శ్రీకాకుళం ఎస్పీ కార్యలయంలో సోమవారం జరిగిన మీకోసం కార్యక్రమానికి 52 ఫిర్యాదులు వచ్చాయి. వాటి పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి పేర్కొన్నారు. తన దృష్టికి వచ్చిన అర్జీలపై సంబంధిత అధికారుల నుంచి వివరణ తీసుకున్నామని చెప్పారు. వారితో ముఖాముఖి మాట్లాడి, సమస్యలను తెలుసుకొని పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని భరోసా కల్పించారు.