News March 28, 2024
టెక్కలి మండలంలో విషాదం
మండలంలోని చిన్ననారాయణపురానికి చెందిన సాలిన రాము(42) అనే వ్యక్తి గురువారం సాయంత్రం మృతి చెందాడు. గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబసభ్యులు హుటాహుటీన టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించగా అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళం తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు తెలిపారు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.
Similar News
News January 17, 2025
SKLM: ‘దివ్యాంగులను ప్రోత్సహించాలి’
దివ్యాంగులలో సృజనాత్మకతను వెలికితీసి వారిని ప్రోత్సహించాలని, వారు ఎందులోనూ తీసిపోరని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లాలో వివిధ మండలాల నుంచి వచ్చిన దివ్యాంగుల నుంచి, జిల్లా దివ్యాంగుల సంక్షేమ శాఖ ఏడి కవితతో కలసి వినతులు స్వీకరించారు. ప్రతి అర్జీని సంబంధిత ప్రధాన అధికారులు వ్యక్తిగతంగా పరిశీలించి ఎండార్స్‌మెంట్ ఇవ్వాలని తెలిపారు.
News January 17, 2025
పలాస: సముద్ర స్నానానికి వెళ్లి యువకుడు గల్లంతు
పలాస నియోజకవర్గం వజ్రపుకొత్తూరు మండలానికి చెందిన జంగం తరుణ్(16) శుక్రవారం సముద్ర స్నానానికి వెళ్లి గల్లంతయ్యాడు. బయటకు రాకపోవడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పండగ సెలవులకు సరదాగా గడుపుతున్న సమయంలో ఇలా జరగడం బాధాకరమని స్థానికులు అన్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది.
News January 17, 2025
శ్రీకాకుళం: నేడు విభిన్న ప్రతిభావంతుల ప్రత్యేక గ్రీవెన్స్ స్వాభిమాన్
శ్రీకాకుళంలో ప్రతి నెల మూడో శుక్రవారం నిర్వహిస్తున్న విభిన్న ప్రతిభావంతుల ప్రత్యేక గ్రీవెన్స్ స్వాభిమాన్ వినతుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించనునట్లు ఆ శాఖ సహాయ సంచాలకులు కె.కవిత తెలిపారు. శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉదయం 10 నుంచి 12 గంటల వరకు ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని జిల్లాలో ఉన్న విభిన్న ప్రతిభావంతులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.