News August 23, 2024

టెక్కలి: మహిళా అధ్యక్షురాలి పదవికి మంజు రాజీనామా

image

టెక్కలికి చెందిన వైసీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు చింతాడ మంజు తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం రాజీనామా లేఖను వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, జిల్లా వైసీపీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌కు లేఖను పంపించారు. పార్టీలో జరుగుతున్న పరిస్థితులు, వ్యక్తిగత కారణాల దృష్ట్యా రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. సుదీర్ఘ కాలం వైసీపీ నాయకురాలిగా మంజు ఉన్నారు.

Similar News

News September 17, 2024

శ్రీకాకుళం: ప్రధాన మంత్రి ఆవాస్ యోజన 2.O ప్రారంభం

image

కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన 2.O కార్యక్రమాన్ని వర్చ్యువల్ విధానంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకంలో లబ్ధిపొందిన లబ్ధిదారులకు గృహ ప్రవేశాలకు సంబంధించి తాళాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎమ్మెల్యే గుండు శంకర్, నడికుడి ఈశ్వరరావు పాల్గొన్నారు.

News September 17, 2024

SKLM: హెల్మెట్ లేకుంటే రూ.1035 ఫైన్

image

బైకు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ వాడాలని.. లేకుంటే ఫైన్ వేస్తామని శ్రీకాకుళం ట్రాఫిక్ సీఐ నాగరాజు హెచ్చరించారు. నగరంలోని 7 రోడ్ల కూడలి వద్ద మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి వాహనదారుడు హెల్మెట్ వాడకం అలవాటు చేసుకోవాలని సూచించారు. హెల్మెట్ లేకుంటే రోడ్లపైకి వస్తే రూ.1035 ఫైన్ వేస్తామని హెచ్చరించారు.

News September 17, 2024

పలాస: దుస్తులు చించి ఆశా వర్కర్‌పై దాడి?

image

పలాస(M) లక్ష్మీపురం(P) కిష్టుపురంలో ఆశా వర్కర్‌ బూర్లె కృష్ణవేణిపై సోమవారం రాత్రి దాడి జరిగింది. బాధితురాలి వివరాల మేరకు.. గ్రామానికి చెందిన లలితమ్మ జ్వరానికి, బీపీకి మాత్రలు కావాలని కోరారు. జ్వరానికి మాత్రలు ఇచ్చి.. బీపీకి డాక్టర్లే చెక్ చేసి ఇస్తారన్నారు. దీంతో లలితమ్మ భర్త కృష్ణారావు, ఆమె కుమారుడు మోహన్ కృష్ణవేణిపై దాడి చేశారు. తన నైటీని కూడా చించేశారంటూ సీఐ మోహనరావుకు ఆమె ఫిర్యాదు చేశారు.