News April 25, 2024

టెక్నికల్ టీచర్ సర్టిఫికేట్ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

image

రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే టెక్నికల్ టీచర్ సర్టిఫికెట్ వేసవి శిక్షణ కోర్సులకు అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతున్నామని హనుమకొండ డిఈఓ అబ్దుల్ హై ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులను తేదీ 24.04.2024 నుంచి 30.04.2024 వరకు స్వీకరిస్తామన్నారు. దరఖాస్తు చేయువారు 22.04.2024 నాటికి 18 సంవత్సరాలు నుండి 45 సంవత్సరముల లోపు ఉండి టెన్త్ పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలన్నారు.

Similar News

News February 5, 2025

MHBD: వైద్యం వికటించి యువకుడు మృతి

image

తొర్రూరు మండలంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. బాధితులు, స్థానికుల వివరాలు.. వైద్యం వికటించి సిద్ధూ(16) మృతి చెందాడు. జలుబు వస్తుందని ఆసుపత్రికి వెళ్తే ఇంజెక్షన్ వేశారని, ఆ వెంటనే సిద్దు మృతి చెందాడని బంధువులు ఆరోపించారు. దీంతో కుటుంబ సభ్యులు డెడ్ బాడీతో ఆస్పత్రిలోనే ఆందోళన చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News February 5, 2025

పార్కులలోని పనులు వెంటనే పూర్తి చేయాలి: కమిషనర్

image

పార్కుల్లో పెండింగ్‌లో ఉన్న పనులు వెంటనే పూర్తి చేయాలని బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అధికారులను ఆదేశించారు. బల్దియా ప్రధాన కార్యాలయంలో హార్టికల్చర్ ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. నగరవ్యాప్తంగా ఉన్న వివిధ పార్కులలో దెబ్బతిన్న జిమ్ పరికరాలు, పిల్లలు ఆడుకునే ఆట వస్తువులను, మరమ్మతులు, దెబ్బతిన లైటింగ్ పునరుద్దించాలని అధికారులను ఆదేశించారు.

News February 5, 2025

WGL: విషాదం.. గుండెపోటుతో యువకుడు మృతి

image

వరంగల్ జిల్లాలో గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఈరోజు ఉదయం ఓ యువకుడు హార్ట్ ఎటాక్‌తో మరణించాడు. నగరంలోని డాక్టర్స్ కాలనీకి చెందిన కుమారస్వామి(33) ఈరోజు ఉదయం అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. మృతుడికి భార్య, 3 నెలల పాప ఉంది. దీంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.

error: Content is protected !!