News February 14, 2025
టెక్నికల్ సర్టిఫికెట్ కోర్స్ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోండి: DEO

ఈ నెల 19 నుంచి 22వ వరకు టెక్నికల్ సర్టిఫికెట్ కోర్స్ (డ్రాయింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ లోయర్, హైయ్యర్ గ్రేడ్) పరీక్షలు నిర్వహిస్తున్నట్లు గుంటూరు డీఈవో సి.వి రేణుక ఒక ప్రకటనలో తెలిపారు.www.bseap.org వెబ్‌సైట్‌లో హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు. గుంటూరు నగరంలోని స్టాల్ స్కూల్, చలమయ్య సాధు సుబ్రహ్మణ్యం పాఠశాలల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు.
Similar News
News February 21, 2025
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

రహదారులపై ప్రమాదానికి కారణం అవుతున్న బ్లాక్ స్పాట్ ప్రాంతాలను గుర్తించాలని కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ అధికారులను ఆదేశించారు. వాహనాల ప్రమాదాలు జరగకుండా అక్కడ అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. గురువారం కలెక్టరేట్‌లో రహదారి భద్రత కమిటీ సమావేశం జరిగింది. రహదారి ప్రమాదాలను పూర్తిగా నివారించేందుకు జాతీయ రహదారులు, ఆర్ అండ్ బీ, పంచాయితీ, మున్సిపల్, రవాణా శాఖలు సంయుక్తంగా రహదారులను తనిఖీ చేయాలని చెప్పారు.
News February 20, 2025
గుంటూరు జిల్లా టుడే టాప్ న్యూస్

★ ANU ఫ్యాకల్టీకి బెస్ట్ టీచర్ అవార్డ్
★ పెన్షన్ల పరిశీలన పారదర్శకంగా జరుగుతుంది: మంత్రి కొండపల్లి
★ గవర్నర్‌ని కలిసిన వైసీపీ శ్రేణులు
★ స్ట్రాంగ్ రూమ్‌లు పరిశీలించిన ఎస్పీ సతీశ్
★ మాదక ద్రవ్యాలపై నియంత్రణకు కలెక్టర్ నాగలక్ష్మీ ఆదేశాలు
★ రేపటి నుంచి జీఎంసీలో ఓటర్ వెరిఫికేషన్ సేవలు
★ పది విద్యార్థులు ఒత్తిడికి గురవ్వొద్దు: DEO
News February 20, 2025
గవర్నర్‌ని కలిసిన వైసీపీ నాయకులు

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి YS జగన్మోహన్ రెడ్డికి భద్రత కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని నేడు రాజ్ భవన్‌కు వెళ్లి గవర్నర్ అబ్దుల్ నజీర్‌ని కలసి వినతిపత్రాన్ని సమర్పించారు. శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ, గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్, మాజీ మంత్రులు అంబటి, మేరుగ, వెల్లంపల్లి, కారుమూరు, ఎమ్మెల్సీలు అప్పిరెడ్డి, అరుణ్ కుమార్ పాల్గొన్నారు.