News March 11, 2025
టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు ఫలితాలు విడుదల

2025 జనవరిలో నిర్వహించిన టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు (టీసీసీ) పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయని డీఈఓ భిక్షపతి ఒక ప్రకటనలో తెలిపారు. మెమోలు www.bse.telangana.gov.in వెబ్ సైట్లో ఉన్నాయని పేర్కొన్నారు. అభ్యర్థులు వారి రోల్ నంబర్, పుట్టిన తేదీ నమోదు చేసుకుని మెమోలు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.
Similar News
News December 19, 2025
నల్గొండ: ఈనెల 22న మాక్ డ్రిల్: సీఎస్

ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ముందస్తు అప్రమత్తతతోనే ప్రాణనష్టాన్ని నివారించగలమని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) రామకృష్ణారావు పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ అధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈనెల 22న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే ‘మాక్ ఎక్సర్‌సైజ్’ను విజయవంతం చేయాలని కోరారు.
News December 19, 2025
నల్గొండ : గురుకుల విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

నల్గొండ మండలంలోని చర్లపల్లి గురుకుల కళాశాలలో బీఎస్సీ చివరి సంవత్సరం చదువుతున్న శివాని అనే విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపింది. మెడ, తల భాగాల్లో తీవ్ర గాయాలతో పడి ఉన్న ఆమెను తోటి విద్యార్థినులు గమనించి వెంటనే పట్టణంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News December 19, 2025
క్లెయిమ్ చేయని ఆస్తులపై 20న అవగాహన శిబిరం

క్లెయిమ్ చేసుకోని ఆర్థికపరమైన ఆస్తుల కోసం డిసెంబర్ 20న నల్గొండ కలెక్టరేట్ కార్యాలయ ఉదయాదిత్య భవనంలో ఉమ్మడి శిబిరం నిర్వహిస్తున్నారు. క్లెయిమ్ చేసుకోని ఆర్థికపరమైన ఆస్తుల వాస్తవ యజమానులు వాటిని పొందేందుకు.. బ్యాంకు శాఖ, భీమా సంస్థ, మ్యూచువల్ ఫండ్ సంస్థ, శిబిరంలోని స్టాక్ బ్రోకరేజీ సంస్థ, ఆన్‌లైన్ ద్వారా స్టాక్ బ్రోకర్‌లలో దేనినైనా సంప్రదించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు తెలిపారు.


