News November 25, 2024
టెక్స్ టైల్స్ పార్కు ద్వారా 10 వేల మందికి ఉపాధి: మంత్రి
ఎమ్మిగనూరు టెక్స్ టైల్స్ పార్కు ద్వారా 5 వేల నుంచి 10 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించనున్నామని మంత్రి సవిత తెలిపారు. ఎమ్మిగనూరులో టెక్స్ టైల్స్ పార్కుకు కేటాయించిన స్థలాన్ని ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర్ రెడ్డితో కలిసి ఆదివారం ఆమె పరిశీలించారు. స్వర్గీయ బీవీ మోహన్ రెడ్డి కల నెరవేరబోతోందని అన్నారు. గడిచిన ఐదేళ్లలో చేనేత కార్మికులకు తీవ్ర నష్టం కలిగిందన్నారు.
Similar News
News December 12, 2024
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండండి: ఎస్పీ
సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కర్నూలు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎస్పీ మాట్లాడుతూ.. ఏదో ఒక లింక్ పంపించి, ఆశ చూపడంతో అమాయక యువత వారి ఉచ్చులో పడి నిలువునా దోపిడీకి గురవుతున్నారన్నారు. ఉచితలకు మోసపోయి సైబర్ నేరగాళ్లు వలలో పడవద్దు అన్నారు. ఎవరైనా సైబర్ నేరాల బారిన పడితే ఘటన జరిగిన వెంటనే, బాధితులు 1930 నంబర్‌కు సమాచారం అందించాలన్నారు.
News December 11, 2024
కలెక్టర్ల సదస్సుకు హాజరైన కర్నూలు జిల్లా కలెక్టర్
అమరావతిలోని సచివాలయం బ్లాక్- 2లో బుధవారం సీఎం చంద్రబాబు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో జరిగిన రెండో కలెక్టర్ల సమావేశానికి కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ఇచ్చిన సూచనలు ఆయన నమోదు చేసుకున్నారు. ఈయనతో పాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాల కలెక్టర్లు కూడా సదస్సుకు హాజరయ్యారు.
News December 11, 2024
భూమా దంపతులు ఉంటే ఇలా మాట్లాడేవారా?: మంచు మనోజ్
భూమా మౌనికకు తల్లిదండ్రులు ఉంటే తన తండ్రి ఇలా ప్రవర్తించే వారా? అని మంచు మనోజ్ ప్రశ్నించారు. ‘భూమా మౌనికను ప్రేమించా. పెళ్లి చేసుకున్నా. అందులో తప్పేముంది. నా భార్య వచ్చాక చెడ్డోడిని అయ్యానంటున్నారు. తాగుడికి బానిసయ్యానని మాట్లాడుతున్నారు. మౌనికకు తల్లిదండ్రులు ఉంటే ఇలా మాట్లాడేవారా. ఇప్పుడు ఆమెకు తల్లీ, తండ్రి అన్నీ నేనే. నా భార్య కష్టపడే వ్యక్తి. నిజాలు తర్వలో తెలుస్తాయి’ అని చెప్పారు.