News October 3, 2024

టెట్ పరీక్షకు 145 మంది గైర్హాజరు

image

కర్నూలు జిల్లావ్యాప్తంగా గురువారం నిర్వహించిన టెట్ పరీక్షకు 145 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ వెల్లడించారు. ఉదయం జరిగిన పరీక్షలో 551 మంది అభ్యర్థులు హాజరు కాగా.. మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 556 మంది అభ్యర్థులు పరీక్ష రాశారని తెలిపారు.

Similar News

News January 20, 2026

రీ సర్వే పకడ్బందీగా జరగాలి: కలెక్టర్ ఆదేశం

image

కర్నూలు జిల్లాలో చేపడుతున్న భూముల రీ సర్వే ప్రక్రియ నిబంధనల ప్రకారం ఎలాంటి లోపాలు లేకుండా జరగాలని జిల్లా కలెక్టర్ డా.సిరి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. మ్యుటేషన్లు, అన్ క్లెయిమ్డ్ భూముల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. రైతుల నుంచి వచ్చే విన్నపాలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ సర్వేను పకడ్బందీగా పూర్తి చేయాలని తెలిపారు.

News January 20, 2026

మద్దికెర, చిప్పగిరి మండలాలకు అభివృద్ధి నిధులు

image

నీతి ఆయోగ్ యాస్పిరేషనల్ బ్లాక్‌గా ఎంపికైన మద్దికెర మండలంలో రూ.కోటి అభివృద్ధి పనులకు ఆమోదం లభించిందని కలెక్టర్ డా.ఏ.సిరి తెలిపారు. అంగన్వాడీలు, హెల్త్ క్లినిక్‌లు, ఆర్వో ప్లాంట్లు, మినీ ట్యాంకుల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయన్నారు. చిప్పగిరి మండలంలో రూ.1.50 కోట్ల పనులకు అనుమతులు వచ్చాయని చెప్పారు. ఈ పనులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

News January 20, 2026

ఎమ్మిగనూరు: విషాదం.. తల్లీకూతురి మృతి

image

తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా ముసాపేట(M) జానంపేట సమీపంలోని NH-44పై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎమ్మిగనూరుకు చెందిన తల్లీకూతురు రాధ (42), లక్ష్మీదుర్గ (8) అక్కడికక్కడే మృతి చెందారు. ఆగి ఉన్న లారీని ఆటో, బొలెరో వాహనాలు ఢీకొట్టి అనంతరం అవతలి రోడ్డుపై ఎదురుగా వస్తున్న కారును ఢీకొనడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో మరో ముగ్గురు గాయపడగా, వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.