News September 28, 2024
టెట్ పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు: DRO
అక్టోబర్ 3వ తేదీ నుంచి జరగనున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్‌కు పటిష్ఠమైన ఏర్పాట్లు చేయాలని DRO పెద్ది రోజా అధికారులను ఆదేశించారు. టెట్ పరీక్షల నిర్వహణపై తన ఛాంబర్లో శనివారం ఆమె సమావేశం నిర్వహించారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 144సెక్షన్ అమలు చేయాలన్నారు. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండాలని చెప్పారు. రవాణా శాఖ అధికారులు అన్ని రూట్‌లలో సకాలంలో బస్సులు నడపాలని స్పష్టం చేశారు.
Similar News
News October 12, 2024
తుళ్లూరులో మద్యం దుకాణాలకు భారీ డిమాండ్
ఏపీలో మద్యం దుకాణాల అనుమతికి గుంటూరు, NTR జిల్లాల నుంచి పెద్దసంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. గుంటూరు జిల్లాలో 127 దుకాణాలకు 4,396 దరఖాస్తులు అందాయి. తొలి 10అత్యధిక దరఖాస్తుల్లో ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల నుంచే 8 ఉన్నాయి. గుంటూరు జిల్లాలోని తుళ్లూరు (104)దుకాణానికి 95దరఖాస్తులు, తుళ్లూరు (102) షాపునకు 86దరఖాస్తులు, తుళ్లూరు(103)దుకాణానికి 82 అప్లికేషన్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
News October 12, 2024
గుంటూరు: డిగ్రీ పరీక్షల టైంటేబుల్ విడుదల
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(డిస్టెన్స్) పరిధిలో బీకామ్ జనరల్ & కంప్యూటర్ అప్లికేషన్స్ కోర్స్ చదివే విద్యార్థులు రాయాల్సిన 1, 3వ సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. 1వ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 17 నుంచి 23 వరకు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయని, 3వ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 17 నుంచి 24 వరకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయని వర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది.
News October 11, 2024
జిల్లా ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్
జిల్లా ప్రజలకు కలెక్టర్ అరుణ్ బాబు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెడుపై మంచి, దుష్ట శక్తులపై దైవశక్తి సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమి పండుగను జరుపుకొంటారని ఆయన పేర్కొన్నారు. దసరా పండుగ జిల్లా ప్రజలందరికీ మేలు చేయాలని, జిల్లా సమగ్ర అభివృద్ధి సాధించాలని ఆయన ఆకాంక్షించారు.