News February 3, 2025

టెన్త్‌లో 100 శాతం ఉత్తీర్ణత సాధించాలి: కలెక్టర్

image

జిల్లాలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో ఉండి చదువుకుంటున్న పదో తరగతి విద్యార్థులు వచ్చే నెలలో నిర్వహించే పబ్లిక్ పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జి. లక్ష్మిశ పేర్కొన్నారు. విజయవాడలో సోమవారం నిర్వహించిన సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్ వార్డెన్‌ల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. గతేడాది 95.2% ఉత్తీర్ణత నమోదయిందని, ఈ ఏడాది 100శాతం నమోదు కావాలన్నారు. 

Similar News

News November 12, 2025

నల్గొండలో సదరం కేంద్రం ప్రారంభించిన మంత్రి

image

దివ్యాంగుల కోసం నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ప్రత్యేక వైకల్య గుర్తింపు కార్డు జారీ కేంద్రాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ కేంద్రం ద్వారా దివ్యాంగులకు వైకల్య గుర్తింపు కార్డులు సులభంగా, వేగంగా లభించే సదుపాయం కలుగుతుందని తెలిపారు. దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో ముఖ్యమైన ముందడుగు అని మంత్రి పేర్కొన్నారు.

News November 12, 2025

చంచల్‌గూడ జైలులో ఖైదీల మధ్య ఘర్షణ

image

HYDలోని చంచల్‌గూడ జైలులో జాబ్రి, దస్తగిరి అనే రౌడీషీటర్ల మధ్య ఘర్షణ జరిగింది. ఈ దాడిలో ఇద్దరికీ గాయాలవ్వగా జాబ్రీని సికింద్రాబాద్ గాంధీకి, దస్తగిరిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ఓ కేసులో రిమాండ్ ఖైదీగా వచ్చిన జాబ్రిను చూడగానే దస్తగిరి దాడికి దిగినట్లుగా తెలుస్తోంది. వీరి గొడవతో ములాఖత్ రూమ్ అద్దాలు ధ్వంసం అయ్యాయి. వారిద్దరి మధ్య పాత గొడవలు ఉన్నట్లు సమాచారం.

News November 12, 2025

జోగులాంబ దేవస్థానం టెండర్లు పూర్తి

image

జోగులాంబ బాలబ్రహ్మేశ్వర దేవస్థానం ఆధ్వర్యంలో బుధవారం సీల్డ్ టెండర్లు, బహిరంగ వేలం టెండర్లు నిర్వహించారు. మొత్తం 14 రకాల టెండర్లకు పిలవగా… ఫొటోలు, క్యాసెట్ల అమ్మకం: రూ.22.60 లక్షలు (వెంకట్రాంరెడ్డి), సౌచాలయం నిర్వహణ: రూ.9.10 లక్షలు (నాగరాజు), సీల్డ్ టెండర్ (లడ్డు కవర్లు): శ్రీదేవి ఏజెన్సీ, సీల్డ్ టెండర్ (టెంట్ హౌస్): శ్రీనివాసులు మిగతా టెండర్లకు ఎవరూ రాకపోవడంతో వాటిని వాయిదా వేశారు.