News March 1, 2025
టెన్త్ పరీక్షలను పక్కాగా నిర్వహించాలి: కర్నూలు కలెక్టర్

మార్చి 17 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించనున్న పదో తరగతి పరీక్షలలో ఎలాంటి పొరపాట్లు జరగకూడదని కలెక్టర్ పి.రంజిత్ బాషా చీఫ్ సూపరింటెండెంట్లను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు సంబంధించి సి.ఎస్.లకు నిర్వహించిన ఓరియంటేషన్ కార్యక్రమంలో కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు. అవాంఛనీయ ఘటనలు లేకుండా పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఆయన సూచించారు.
Similar News
News March 27, 2025
ఫోన్ చూడొద్దన్నందుకు కర్నూలులో యువకుడి ఆత్మహత్య

తల్లిదండ్రుల మందలించారని యువకుడు ఆత్మహత్యకు చేసుకున్న ఘటన కర్నూలులో జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. చౌడేశ్వరి వీధిలో నివాసం ఉంటున్న కృష్ణమోహన్, వసంత దంపతుల కుమారుడు యశ్వంత్ (21) వడ్రంగి పని చేస్తున్నారు. కొన్ని రోజులుగా పనికి వెళ్లకుండా ఫోన్ చూస్తుండంతో వారు మందలించారు. మనస్తాపం చెందిన యువకుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News March 27, 2025
బైరెడ్డికి పదవి.. వైసీపీ శ్రేణుల హర్షం

వైసీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి వైఎస్ జగన్ కీలక పదవి ఇవ్వడంపై ఆ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. వైసీపీ రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించడంతో సిద్ధార్థ్ రెడ్డికి శుభాకాంక్షలు చెబుతూ జగన్ మంచి నిర్ణయం తీసుకున్నారంటూ కొనియాడుతూ పోస్టులు పెడుతున్నారు. మరోవైపు ‘నాపై నమ్మకంతో మరో బాధ్యత ఇచ్చిన జగన్ అన్నకి ప్రత్యేక ధన్యవాదాలు’ అంటూ బైరెడ్డి ట్వీట్ చేశారు.
News March 27, 2025
కర్నూలు జిల్లాలో భానుడి సెగలు.!

కర్నూలు జిల్లాలో గత కొద్ది రోజులుగా భానుడు విలయ తాండవం ఆడుతున్నాడు. ఏపీ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) గణాంకాల ప్రకారం బుధవారం ఆలూరు మండలం కమ్మరచేడులో 40.7°C ఉష్ణోగ్రత నమోదై రాష్ట్రంలోనే జిల్లా రెండవ స్థానంలో నిలిచింది. కాగా, మార్చి నెలలోనే ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.