News March 14, 2025
టెన్త్ పరీక్షలపై జేసీ సమీక్ష..అధికారులకు పలు సూచనలు

జిల్లా వ్యాప్తంగా ఈనెల 17 నుంచి ఏప్రిల్ 1 వరకు 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు అస్కారం లేకుండా తగిన చర్యలు తీసుకుంటూ సజావుగా నిర్వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి. నిషాంతి అధికారులను ఆదేశించారు. గురువారం 10వ తరగతి పరీక్షల నిర్వహణ సన్నద్ధతపై అధికారులతో జేసీ సమీక్షించారు. 19,217 మంది విద్యార్థులకు 110 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జేసీ తెలిపారు.
Similar News
News November 21, 2025
వేగంగా విస్తరిస్తోన్న విశాఖ

GDPలో దేశంలో టాప్-10 నగరాలలో నిలిచిన విశాఖ నగరం వేగంగా విస్తరిస్తుంది. కార్పొరేషన్గా ఉన్న విశాఖపట్నం తరువాత గాజువాక, భీమిలి, అనకాపల్లి మున్సిపాలిటీల విలీనంతో మహా విశాఖ నగర పాలక సంస్థగా ఏర్పడింది. ఇప్పుడు అనకాపల్లి నుంచి విజయనగరం వరకు అభివృద్ధితో వేగంగా దూసుకుపోతుంది. ఒక వైపు భోగాపురం ఎయిర్ పోర్టు, మరోక వైపు డేటా సెంటర్లు, ఐటీ కంపెనీలు వస్తున్నాయి.CII సమ్మిట్లో పెద్ద ఎత్తన పెట్టుబడులు వచ్చాయి.
News November 21, 2025
24 నుంచి కొత్త కార్యక్రమం

AP: సాగును లాభసాటిగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నెల 24 నుంచి ‘రైతన్నా మీకోసం’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. వారంపాటు జరిగే ఈ ప్రోగ్రామ్లో భాగంగా అధికారులు, ప్రజాప్రతినిధులు అన్నదాతల ఇళ్లకు వెళ్తారు. పురుగుమందుల వాడకంతో నష్టాలు, నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటల సాగు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వాల మద్దతుపై అవగాహన కల్పిస్తారు. అలాగే DEC 3న RSKల పరిధిలో వర్క్షాపులు నిర్వహిస్తారు.
News November 21, 2025
మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

<


