News March 20, 2025

టెన్త్ పరీక్షలు.. జిరాక్స్ సెంటర్ల బంద్ చేయాలి: వరంగల్ సీపీ

image

పదో తరగతి పరీక్షల సందర్భంగా పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు పరీక్ష నిర్వహిస్తున్న సమయంలో పరీక్ష కేంద్రాల సమీపంలో ఎలాంటి జిరాక్స్ సెంటర్లు తెరిచి ఉండవద్దని సీపీ సన్ ప్రీత్ సింగ్ అదేశించారు. ఎగ్జామ్‌కు హాజరయ్యే విద్యార్థులతో పాటు ఇన్విజిలేటర్ల వద్ద ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు లేకుండా జాగ్రత్త పడాలన్నారు. ముఖ్యంగా పరీక్ష కేంద్ర పరిసరాల్లో నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు.

Similar News

News November 14, 2025

సా.5 గంటలకు సీఎం రేవంత్ ప్రెస్‌మీట్

image

TG: సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు సా.5 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. సా.4 గంటలకు మంత్రులతో సమావేశమైన అనంతరం మీడియాతో మాట్లాడనున్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక, బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆయన మాట్లాడే అవకాశం ఉంది. జూబ్లీహిల్స్ ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం దిశగా దూసుకెళ్తోన్న సంగతి తెలిసిందే.

News November 14, 2025

రెయిన్‌బో డైట్‌ గురించి తెలుసా?

image

బరువు తగ్గడానికి కొందరు, ఆరోగ్యం కాపాడుకోవడానికి ఇంకొందరు, కండలు తిరిగిన దేహం కోసం మరికొందరు రకరకాల డైట్‌ ప్లాన్‌లను అనుసరిస్తున్నారు. వాటిల్లో ఒకటే రెయిన్‌బో డైట్. పళ్లెంలో రంగురంగుల పళ్లు, కాయగూరలు, ఆకుకూరలకు చోటు కల్పించడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చంటున్నారు నిపుణులు. దీనిద్వారా శరీరానికి కావాల్సిన అన్ని రకాల పోషకాలు అందుతాయంటున్నారు.

News November 14, 2025

NLG: చేప పిల్లలు నాసిరకం: మత్స్యకారులు

image

జిల్లాలో చేప పిల్లల పంపిణీ అస్తవ్యస్తంగా మారింది. చెరువులు, కుంటలకు పూర్తిగా నాసిరకం సీడ్‌ వస్తున్నదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 6 కోట్ల చేప పిల్లలను పంపిణీ చేయనుండగా.. ఇప్పటివరకు 60 లక్షలకు పైగానే చేప పిల్లలు పంపిణీ చేశారు. జిల్లాలోని ముత్యాలమ్మ చెరువు, కోతకుంట, ఉంగూరుకుంట చెరువులకు పంపిణీ చేసిన చేప పిల్లలు నాసిరకంగా ఉన్నాయని మత్స్యకారులు ఆరోపించారు.