News February 14, 2026
టెన్త్ పరీక్షలు రాయనున్న వైభవ్ సూర్యవంశీ

సంచలన ఆటతో U19 WC గెలుపులో <<19068083>>కీలక పాత్ర<<>> పోషించిన వైభవ్ సూర్యవంశీ ఇక పరీక్షలపై ఫోకస్ పెట్టనున్నారు. ఈ నెల 17 నుంచి జరిగే CBSE పదో తరగతి ఎగ్జామ్స్ రాయనున్నారు. ఈ మేరకు అతడికి అడ్మిట్ కార్డు అందజేసినట్లు పోడార్ ఇంటర్నేషనల్ స్కూల్(బిహార్) ప్రిన్సిపల్ నీల్ కిశోర్ సిన్హా తెలిపారు. పరీక్షా హాలులో సాధారణ విద్యార్థి మాదిరే వైభవ్‌నూ చూస్తామని స్పష్టం చేశారు.
Similar News
News March 9, 2026
బేర్ పంజా.. సెన్సెక్స్ 2వేల పాయింట్లు క్రాష్!

యుద్ధం, క్రూడ్ ఆయిల్ ధరల ఎఫెక్ట్ ఈరోజు స్టాక్ మార్కెట్లపై భారీగా పడింది. సెన్సెక్స్ 2341 పాయింట్లు కోల్పోయి 76,605కు చేరగా.. నిఫ్టీ 700 పాయింట్లు కోల్పోయి 23,741 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ టాప్ 30 ఇండెక్స్ సూచీలో అన్ని షేర్లు నష్టాల్లోనే ఉన్నాయి. రూపాయి విలువ సైతం జీవితకాల కనిష్ఠానికి చేరింది. ఒక డాలరుకు 92.30గా ఉంది. FII అమ్మకాలు కూడా మార్కెట్‌పై ప్రభావం చూపిస్తున్నాయి.
News March 9, 2026
మండే ఎండలు.. ఉరుములతో వర్షాలు

AP: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. నిన్న దాదాపు అన్ని జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. కర్నూలులో 38.9, కడపలో 38.8 డిగ్రీల గరిష్ఠ టెంపరేచర్ రికార్డయింది. మరోవైపు ఉపరితల ద్రోణి ప్రభావంతో అక్కడక్కడా వర్షాలు కురిశాయి. ఇవాళ కూడా ఉత్తర కోస్తా జిల్లాల్లో ఉరుములతో కూడిన వానలు పడతాయని IMD వెల్లడించింది.
News March 9, 2026
దారుణం.. బీమా డబ్బు కోసం భర్తనే చంపేసింది

TG: అనారోగ్యంతో ఉన్న భర్తను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన భార్య దారుణానికి పాల్పడిన ఘటన ఖమ్మంలో జరిగింది. అతడు కచ్చితంగా చనిపోతాడని రూ.66 లక్షలకు ఇన్సూరెన్స్ చేయించింది. అయితే కొన్ని నెలలైనా మరణించకపోవడంతో డబ్బు కోసం పథకం వేసింది. భర్త రవికి మద్యం తాగించి మరో నలుగురితో కలిసి కారుతో ఢీకొట్టి చంపేసింది. బంధువుల ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేసి భార్య ప్రశాంతి, ఇతర నిందితులను అరెస్టు చేశారు.


