News January 28, 2025
టెన్త్ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి: నిర్మల్ కలెక్టర్

పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్నందున ప్రత్యేకాధికారులు ఎప్పటికప్పుడు ప్రభుత్వ పాఠశాలలను సందర్శిస్తూ విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. విద్యార్థులకు నిర్వహించిన పరీక్షా ఫలితాల వివరాలను అందజేయాలని, వారికి ఏమైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.
Similar News
News November 15, 2025
SSMB29: టైటిల్ ‘వారణాసి’

రాజమౌళి- మహేశ్‌బాబు కాంబినేషన్లో తెరకెక్కుతోన్న SSMB29 సినిమాకు ‘వారణాసి’ టైటిల్ ఖరారైంది. అలాగే మహేశ్ క్యారెక్టర్‌ను రుద్రగా పరిచయం చేస్తూ రాజమౌళి పోస్టర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇందులో మహేశ్ నందిపై కూర్చున్న లుక్ అదిరిపోయింది. GlobeTrotter పేరుతో ప్రస్తుతం RFCలో ఈవెంట్ గ్రాండ్‌గా కొనసాగుతోంది.
News November 15, 2025
‘ఎస్సీ విద్యార్థులను ఉన్నత విద్యకు ప్రోత్సహించాలి’

షెడ్యూల్డ్ కులాల విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించే దిశగా ప్రోత్సహించాలని జాతీయ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్ అన్నారు. శనివారం కాగజ్‌నగర్‌లో సాంఘిక సంక్షేమ పాఠశాలలు, వసతి గృహాలను ఆయన సందర్శించారు. అనంతరం ఎస్సీ విద్యార్థుల సంక్షేమం, వసతి సౌకర్యాలు, విద్యా ప్రమాణాలపై కలెక్టర్ వెంకటేష్ దోత్రే, ఈడీ సురేష్ కుమార్, ఇతర అధికారులతో సమీక్షించారు.
News November 15, 2025
ASF: ‘10వ తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలి’

10వ తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి వార్షిక పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా చర్యలు తీసుకోవాలని ఇన్చార్జి జిల్లా విద్యాధికారి దీపక్ తివారి అన్నారు. శనివారం ASF జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఆశ్రమ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో 10వ తరగతి విద్యార్థులకు విద్యా బోధన, విద్యార్థుల హాజరు, మౌలిక వసతుల కల్పన అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.


